శరీర కదలికల నుండి విద్యుదుత్పత్తి సాధ్యం

ప్రస్తుతం విద్యుత్తూ, దాని ఉత్పాదన మీద జరుగుతున్న పరిశోధనలు గూర్చి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద పరికరాలు పని చేయడానికి విద్యుత్తుకు నేరుగా అనుసంధానం కలిగి ఉండేది. ఆ పైన బాటరీలు వచ్చాయి. ఇప్పటికీ మనం సెల్ ఫోన్లలో బాటరీలు వాడుతూనే ఉన్నాం. దానిని ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేయాల్సి రావడం, ఇలాగే మరి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయాలంటే బయట నుండి విద్యుత్తూ (Power Outlet) అవసరం.

ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలను తమంత తామే ఛార్జ్ అయ్యేలా రూపొందిస్తున్నారు. లేదంటే, ఏ సూర్య రశ్మి ద్వారానో ఛార్జ్ అయ్యేలా పరిశోధనలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పరికరాలు తమంత తామే పనిచేయడానికి మనుష్య కదలికల నుండి విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోగలవు అంటే ఆశ్చర్యం కలగక మానదు కదూ. ఈ దిశగా ఎప్పటినుండో పరిశోధనలు జరుగుతున్నా ఏవీ విజయం సాధించలేదు. కారణం, మనుష్య కదలికల నుండి వచ్చే శక్తిని విద్యుత్ గా మార్చడం చాలా కష్టం (మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ). అంటే మనుషులు కదిలినప్పుడు, నడిచినప్పుడు, వంగినప్పుడు మొదలైన పనులు చేసేప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తి కేవలం 10 cycles / second.

కానీ ఇప్పుడు Vanderbilt University లోని Nanomaterials and Energy Devices Laboratory లో ఒక చిన్న బాటరీ వంటి పరికరాన్ని తయారు చేసారు మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ Cary Pint. ఈ బాటరీ లో ఉపయోగించిన black phosphorous కేవలం 5 nm మందం ఉంటుంది. అంటే మన వెంట్రుక కంటే 5000 రెట్లు తక్కువ మందంగా ఉంటుంది. ఈ బాటరీ తో తయారు చేసిన పరికరం మీద కొద్దిగా ఒత్తిడి చేస్తే దాని ఫలితంగా కలిగే voltage difference ను ఈ వీడియో లో చూడవచ్చు. అలా తయారు చేసిన ఈ black phosphorous బాటరీ కదలికల నుండి విద్యుత్తు ను ఉత్పత్తి చేసుకోగలదు. ఇలా కదిలినప్పుడు, వంగినప్పుడే కాక ఏకధాటిగా ఎక్కువ సేపు కూర్చునప్పుడు, నుంచునప్పుడు కూడా ఈ పరికరం విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలదు.

ఈ Black phosphorous బాటరీ కి కొన్ని ఉపయోగాలున్నాయి. ఈ పరికరం ఇంత పలుచగా ఉండటం వల్ల దీనిని బట్టల్లో సైతం అమర్చి టెక్స్టైల్స్ ను తయారు చేయవచ్చు. వాటిని ధరిస్తే వేరే పవర్ సోర్స్ అవసరo లేకుండా మన వేరబుల్స్ ను మన శరీర కదలికల ద్వారా ఛార్జ్ చేయవచ్చు.

ఇక ఈ black phosphorous పరికరాన్ని ఉపయోగించి మొబైల్ ఛార్జ్ చేయడం పై కూడా పరిశోధన చేయాల్సి ఉంది. ఈ పరిశోధనను ACS Energy Letters అనే జర్నల్ లో ప్రచురించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *