ఇప్పటిదాకా మనం ఇళ్ళు లేదా వాణిజ్య భవనాల కొనుగోలు కోసం ఆయా నిర్మాణ సంస్థల ప్లాన్ ద్వారానే కొనుగోళ్ళు జరిగాయి. అంటే ఫలానా చోట ఒక కొత్త నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఇంజనీర్ వేసిన ప్లాన్ అటు తర్వాత వారు ముద్రించిన బ్రోచర్ ఆధారంగానే మనకు కొద్దో గొప్పో ఆ నిర్మాణం గూర్చి ఒక అవగాహన వస్తుంది. అయితే ఈ పద్ధతికి కాలం చెల్లనుంది. సరి కొత్త సాంకేతిక పరిజ్ఞ్యానం తో నిర్మాణ సంస్థలు కూడా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే పనిలో ఉన్నారు. అదేలాగో చూద్దామా…

Virtual Reality. ఈ పేరు ఇప్పుడు తరచుగా వినిపిస్తోంది. దీని గూర్చి సంక్షిప్తంగా చెప్పాలంటే వీడియో గేములలో ఇది ఒక రకం. అంటే దీని ద్వారా మనం లేని దానిని ఉన్నట్టు ఊహించుకుని ఆ ప్రపంచంలో మన కదలికల ద్వారా మనమూ భాగమై ఆనందించడం అన్న మాట. అయితే ఇదంతా ఒక headset ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ headset లేనిదే ఈ virtual reality ఆటలు ఆడటం సాధ్యం కాదు. HTC, Samsung మరియు Microsoft వంటివి ఇప్పటికే తమ VR headsets ను ప్రవేశ పెట్టాయి. కేవలం వినోదం కోసం ఉపయోగిస్తున్న ఈ VR సాంకేతికతను ఐర్లాండ్ లోని ఒక నిర్మాణ సంస్థ తమ వినియోగదారులకు మెరుగైన సేవలందించడం కోసం ఉపయోగిస్తోంది.

ఐర్లాండ్ కు చెందిన Sherry Fitzgerald అనే సంస్థ Samsung VR headset ద్వారా వినియోగదారులకు తమ నిర్మాణాలు పూర్తి కాక ముందే అవి ఎలా ఉండబోతున్నాయో చూపిస్తోంది. ఆ సంస్థ వారి Rokeby Park అనే గృహ నిర్మాణ సముదాయాలు ఈ విధంగా VR ద్వారా ఎలా ఉంటాయో చూడవచ్చు. ఆ ఇంటి లోపలి గదులు, గోడల ఎత్తు, ఒక్కో గదిలో మనం నడిచి చూసినట్టు ఉంటుంది అన్న మాట. దీనికి వినియోగదారుల నుంచీ మంచి స్పందనే వస్తోంది అంటున్నారు ఈ సంస్థ వారు. అయితే ఈ VR పరిజ్ఞ్యానం ఈ సంస్థలోని కొన్ని నిర్మాణాలకు మాత్రమే అందుబాటులో ఉందనీ, త్వరలోనే దీనిని అన్ని నిర్మాణాలకూ విస్తరిస్తామని ఈ సంస్థ వారు చెబుతున్నారు.

మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకోబోయే ఇళ్ళు ఎలా ఉంటుందో చూడాలి అని ఎవరికి అనిపించదు చెప్పండి. సంస్థ యొక్క స్వప్రయోజనం కోసమే అయినా ఈ సంస్థ నిర్మాణ సంస్థలకు ఒక కొత్త దారి చూపింది అనడంలో సందేహం లేదు. మరింకేం మన దేశంలో కూడా భావన నిర్మాణ సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తే అంతిమంగా వినియోగదారులకు మేలే జరుగుతుంది.

Courtesy