ప్రస్తుత పరిశోధనలు మనం నిత్యం వాడే వస్తువుల ద్వారానే అవయవాల పని తీరును గమనించడం, తద్వారా చిన్న చిన్న వస్తువులతో వాటికి పరిష్కారాలను సూచిస్తున్నారు. స్మార్ట్ వాచ్ సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది. అలాగే డయాబెటిస్ (చక్కెర వ్యాధి), vertigo, బరువు తగ్గడం, నిద్ర పట్టడానికి, parkinsons వ్యాధికి ఇలా పలు రకాల సమస్యలకు ప్రత్యేకమైన స్మార్ట్ గాగుల్స్ పరిష్కారమంటున్నారు అమెరికా, ఇజ్రాయిల్ కు చెందిన పరిశోధకులు. ముందుగా డయాబెటిస్ కు ఈ స్మార్ట్ గాగుల్స్ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

అమెరికాలోని Northwestern University Hospital కు చెందిన పరిశోధకులు Re-Timer అనే ఒక ప్రత్యేకమైన గాగుల్స్ ను రూపొందించారు. ఇది ఎలా పని చేస్తుందో తెలియాలంటే, ముందుగా మనం కాంతి మన శరీరం పై చూపే ప్రభావం గురించి తెలుసుకోవాలి. కాంతి/సూర్య కాంతి మన శరీర పని తీరును (body clock/circadian rhythm) తద్వారా హార్మోన్ల విడుదలను ప్రభావితం చేస్తుంది. మన శరీరంలో ఎప్పుడు ఎంత ఇన్సులిన్ విడుదల కావాలో కూడా ఈ body clock నియంత్రిస్తుంది. రోజులో అధిక భాగం సూర్య కాంతి తగలకుండా గడిపితే అలాంటి వారికి హార్మోన్ల అసమతుల్యం, నిద్రా సమస్యలు మొదలవుతాయి. అలాగే కాంతి ద్వారా body clock మన శరీరంలో హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. మన body clock ఇన్సులిన్ విడుదల ద్వారా శరీరంలో blood sugar ను ప్రభావితం చేస్తుంది.

ఇప్పుడు మనo చెప్పుకోబోయే స్మార్ట్ గాగుల్స్ పేరు Re-Timer. దీని ఫ్రేమ్లో 4 LED లైట్లు ఉన్నాయి. దీనిలో అద్దాలు ఉండవు. ఈ గాగుల్స్ ను pre-diabetes ఉన్నవారు ఉదయం ఒక గంట సేపు ఉపయోగించాలి. దీనిలోని LED లైట్ల కాంతి కళ్ళ పై పడి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా blood sugar ను తగ్గించి type 2 డయాబెటిస్ నుం అరికడుతుంది.

ఈ గాగుల్స్ ను Northwestern University Hospital లోని 34 మంది ప్రీ డయాబెటిస్ పేషెంట్ల మీద ఉపయోగించనున్నారు. అయితే ఇంకా ఫలితాలు రావాల్సి ఉన్నాయి. కానీ ఈ గాగుల్స్ సమర్ధవంతoగా పని చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీని రూపకర్తలు. ఎందుకంటే, ఈ గాగుల్స్ అంతకు పూర్వం jet lag కొరకు ఉపయోగించారు. సరిగ్గా కాంతి కళ్ళ పై ప్రసరించి వేరొక time zone కు వెళ్ళిన వారు సరిగ్గా అక్కడ సమయానికి పడుకునే విధంగా ఈ గాగుల్స్ ముందుగా పెట్టుకుంటే సరైన సమయానికి నిద్ర పట్టినట్టు రుజువైంది.కాంతి ద్వారా హార్మోన్లు ప్రభావితం చేయబడతాయని, కాంతి ద్వారా డయాబెటిస్ నియంత్రించబడుతుందని గత సంవత్సరం జర్నల్ డయాబెటిస్ లో ప్రచురించబడింది.

అలాగే ఇలాంటి స్మార్ట్ గాగుల్స్ లో MetaCookie అనే గాగుల్స్ బరువు తగ్గడానికి రూపొందించారు. ఇది పెట్టుకుంటే, తినే వస్తువు 50 శాతం పెద్దగా కనుబడుతుంది. ఆ విధంగా తక్కువ తినడం ద్వారా బరువు తగ్గుతారు. జపాన్ శాస్త్రవేత్తలు ఈ గాగుల్స్ ను రూపొందించారు.

ఇలా parkinsons, శస్త్ర చికిత్స తరువాత నొప్పి తగ్గడానికి మందులకు ప్రత్యామ్న్యాయంగా గాగుల్స్ ను రూపొందించారు. జబ్బులకు గాగుల్స్ (కళ్ళ జోడు) వాడటం అనేది పూర్తిగా కొత్త ఒరవడిని సృష్టించనుంది.