మనుషుల స్థాయి చాలా పెరిగిపోతోంది. ఒకప్పుడు భూమిని ఆధారం చేసుకునే ఉండేవాళ్ళు కాస్తా ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నారు. రసాయనాలతో యుద్ధాలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. అంతే కాదు లాభం కోసం పోతే నష్టం ఎదురైందని మనుషుల అత్యాశ పర్యావరణాన్ని పాడు చేస్తోంది. chemical spills, nuclear spills, nuclear disasters ఇప్పటికే మనం చూసాం. అవి ఎక్కడో జరిగినా ఇప్పటికీ ఎక్కడైనా జరిగే ఆస్కారం ఉంది. chernobyl వంటి ఘోర న్యూక్లియర్ ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరిదీ. బాధ్యత తరువాత అసలు దానికి ఏమిటి పరిష్కారం. ఇలాంటి ప్రమాదాల వల్ల మానవ జాతికే కాదు పర్యావరణం దెబ్బ తింటుంది. మన చుట్టూ ఉండే కొన్ని రకాల జీవ జాతులు అంతరించిపోతాయి. తిరిగి అక్కడ గడ్డిపోచ మొలవాలన్నా కొన్ని దశాబ్దాలు పడుతుంది. అలాంటప్పుడు తిరిగి ఆ ప్రదేశాన్ని పునరుద్ధరణ ఎలా చేయాలి అంటే ఒక ఆసక్తికర సమాధానం దొరుకుతుoది. ఏంటంటే అది ఖచ్చితంగా మానవుల చేతుల్లో లేదు, పరోక్షంగా ఉంది. ఇటువంటి న్యూక్లియర్ రేడియేషన్, కెమికల్ స్పిల్ల్స్ ఇంకా పలు రకాలా మానవ చర్యలకు చెట్లు మాత్రమే పరిష్కారం.

ఆస్ట్రేలియాలోని University of Technology Sydney కి చెందిన ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ Megan Philips వారి దేశంలోని అడవుల మీద పరిశోధన చేస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఆస్ట్రేలియా అడవుల్లో ఎన్నో రకాల చెట్ల జాతులు ఇలాంటి ప్రమాదాలను సమర్ధవంతంగా ఎదుర్కొని తిరిగి అక్కడ భూమిలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తాయి. ఒక్కో జాతికి చెందిన చెట్టు ఒక్కో రకం విషవాయువులను హరించగలదు. ఉదా. పొద్దుతిరుగుడు (Sunflower) చెట్లు పర్యావరణంలో ఉన్న radionuclieds ను పీల్చుకోగలవు. అలాగే మన Indian Mustard ప్లాంట్ భూమిలో నుండి హెవీ మెటల్స్ ను పీల్చుకుంటుంది. ఇలా ఒక్కో చెట్టు ఒక్కో రకంగా భూమిని కాపాడుతూ ఉంటుంది. సహజంగా పెద్ద పరిశ్రమలు, రసాయన కారాగారాలు, న్యూక్లియర్ రేడియేషన్ వంటి ప్రమాదాలతో కలుషితమైన ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలి అంటే అక్కడ తవ్వి, అందులో మట్టిని తీసి మరో ప్రాంతానికి పంపించి ఇంకా చాలా చాలా చేస్తే ఓ మోస్తరు ఫలితం ఉంటుంది. కానీ కేవలం అక్కడ భూమిని పునరుద్ధరించడానికి దానికి తగిన చెట్టును ఎంచుకుని అక్కడ పెంచితే చాలు. అంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా తానూ ఎదిగి చుట్టూ ఉన్న పర్యావరణాన్ని బాగు చేస్తుంది చెట్టు. ఇలా అతి తక్కువ సమయంలో తిరిగి అక్కడ భూమినే కాదు వాతావరణాన్ని కూడా సాధారణ స్థాయికి తీసుకురాగల సామర్ధ్యం చెట్లకు ఉంది. ఇదంతా Phyto remediation అనే పద్ధతి ద్వారా చేస్తారు. అంటే చెట్టును ఆధారం చేసుకుని, సూర్య కాంతి ద్వారా భూమిని, వాతావరణాన్ని శుద్ధి చేయడం అన్న మాట.

ఇప్పటికే ఈ Phytoremediation ను కొన్ని దేశాలలో అమలుపరిచారు. కానీ దీని పై ఇంకా విస్తృత పరిశోధన జరగాల్సి ఉంది అంటున్నారు Philips. నిజమే ప్రపంచ దేశాలు ఈ దిశగా దృష్టి సారిస్తే climate change వల్ల అతలాకుతలం అయిపోతున్న భూమిని తిరిగి రక్షించుకునే మార్గం కనిపిస్తుంది.

అందుకేనేమో మన పూర్వీకులు వృక్షో రక్షతి రక్షితః అన్నారు. దీని బట్టి చూస్తే పర్యావరణానికి మనుషుల కంటే చెట్ల అవసరమే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. అందుకే ఏ పుట్టలో ఏముందో కాదు ఏ చెట్టులో ఏముందో అనుకుని చెట్లు నరకడం ఇకనైనా మానేస్తే వాటి పని అవి చేసి పర్యావరణాన్ని రక్షిస్తాయి.

Courtesy