ప్రపంచమంతా జనాభా పెరుగుతుంటే వాటి అవసరాలకు తగ్గ విద్యుత్తును అన్ని దేశాలు ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమoలో రెండు మార్గాలు ఉన్నాయి – సంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తి చేసుకోవడం అంటే బొగ్గు మొదలైన వాటి నుంచి విద్యుదుత్పత్తి. రెండవది సౌర శక్తి, పవన శక్తి, మొదలైనవి ఉపయోగించుకోవడం. ఐతే సంప్రదాయ పద్ధతిలో వినియోగం పెరిగే కొద్దీ వనరులు తగ్గిపోతుంటాయి. అదే సౌర శక్తి మొదలైనవి ఎప్పటికీ తరగవు అని మనకు తెలుసు.

సౌర శక్తి విద్యుత్ వినియోగం మొదలై ఇప్పటికే రెండు దశాబ్దాలు అయింది. అలా మొదలైనప్పటి నుంచీ ఈ రోజు దాకా చాలా అభివృద్ధినే సాధించాం. ఇప్పటికే మన దేశంలో సోలార్ వాటర్ హీటర్, రూఫ్ టాప్ సోలార్ సిస్టం మొదలైనవి వాడటం మొదలైంది. అయినప్పటికీ ఈ తరహా విద్యుదుత్పత్తికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. 1. Solar cells సామర్ధ్యం తక్కువ ఉండడం.
2. స్థాపించాల్సిన ప్రదేశం (Installed area).

ఇక గృహ, పారిశ్రామిక అవసరాల కోసం కూడా వినియోగించాల్సి వస్తే ముందుగా స్థలం ఒక సమస్య అయ్యి కూర్చుంది. ఎందుకంటే ఒక అపార్ట్ మెంట్ లో అందరికీ ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం పెట్టుకునే సౌకర్యం ఉండదు. సరిగ్గా ఈ పరిమితిని అధిగమించి సౌర శక్తిని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసారు Stanford University కి చెందిన ప్రొ. Xiaolin Zheng.
ఈమె తన తండ్రి ఎదుర్కొనే ఈ సమస్యను పరిష్కరించే దిశలో తన బృందం తో కలిసి ఈ Solar stickers ను తయారు చేసారు. అంటే ఇంటి పైన పెట్టుకోవాల్సిన బరువైన Solar panels ను solar stickers గా మార్చేసి మనం ఎక్కడంటే అక్కడ అంటే – ఇంటి బయట గోడల పైనా, లేదా ఫోన్ల మీద, కార్ల మీద ఇలా ఎక్కడంటే అక్కడ అతికించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

ముందుగా ఈ సోలార్ panels తయారు చేసే విధానంలో solar cells ఎంతో పలుచగా కేవలం కొన్ని మైక్రాన్ల మందం తో కూడుకుని ఉంటుంది. కానీ దానిని ఎంతో బరువైన glass/సిలికాన్ మీద పరుస్తారు. ఈ క్రమంలో ఈ panels బరువైనవీ, ఎటూ మలచలేని విధంగా ఉంటాయి. కానీ Xiaolin, ఈ పద్ధతిలో ఒక చిన్న మార్పు ద్వారా Flexible Solar Cells ను తయారు చేసారు.

సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే సోలార్ panels లో, కొన్ని మైక్రాన్ల మందం ఉండే ఈ సోలార్ సెల్స్ ను గ్లాస్ మీద పరిచేటప్పుడు ఈ రెండిటికీ మధ్యలో ఒక మెటాలిక్ పొరను ఉంచారు. ఇప్పుడు ఈ పానెల్ ను ఒక నీళ్ళ టబ్ లో నానపెడితే ఈ పొర ఊడి వచ్చేస్తుంది. ఎంత సమయంలో అనుకుంటున్నారా కేవలం ఒకే ఒక్క నిముషం నీళ్లల్లో ఉంటే చాలు. అంతే కాదు ఈ పద్ధతిలో ఈ పొరకు సోలార్ సెల్స్ ఎక్కడా అతుక్కుని ఉండవు. పైగా ఈ పొరను తిరిగి మరో స్టికర్ ను తయారు చేయడానికి వాడవచ్చు.

అంతే ఈ పొరను ఎక్కడంటే అక్కడ తేలిగ్గా తగిలించుకుని వాడుకోవచ్చు. ఈ Solar stickers తేలిగ్గా ఉండటం, సౌకర్యంగా ఎక్కడంటే అక్కడ తగిలించుకుని సౌర శక్తిని వాడుకోవడం వల్ల ఈమెకు MIT Technology Review వారి “Innovators Under 35” లో చోటు దక్కింది. అంతే కాదు Xiaolin అమెరికా లోని NREL (National Renewable Energy Laboratory) తో కలిసి ఈ solar stickers ను తయారు చేసారు. ఈ పద్ధతిలో సోలార్ సెల్స్ యొక్క సామర్ధ్యం తగ్గకపోవడం విశేషం.