Swimming (ఈత). ఈ మధ్య కాలంలో దీనికి ఆదరణ బాగా పెరుగుతోంది. పిల్లలూ, పెద్దలూ కూడా ఈత నేర్చుకోవడానికి ఉత్సాహ పడుతున్నారు. ఆరోగ్యం కోసo అయినా అభిరుచి కోసమైనా ఈత ఒక మంచి అలవాటు. ఇక దీనిని ఒక ఆటగా భావించి ఈత పోటీలకు వెళ్ళే వారు మరింత శ్రద్ధగా సాధన చేస్తారు. ఎవరికైనా సరే, కోచ్ డెక్ (deck) మీద ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈత కొట్టాల్సిన విధానం, దానికి తగ్గ సూచనలూ చేస్తాడు. కానీ నీటిలో మరోలా జరుగుతుంది. దీనికి కారణం నీటిలో శబ్దం వేగంగా ప్రయాణించక పోవడమే. మాటి మాటికీ నీటి పైకి వచ్చి కోచ్ (swim coach) సూచనలు విని మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళాలి. ఇవి అప్పుడే కొత్తగా ఈత మొదలు పెట్టిన వారి ఇబ్బందులు. అంతే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్ళే వారికీ వారి సాధన (training) లో మెరుగైన శిక్షణ ఇవ్వడం కోసం అందుబాటులోకి వచ్చింది CoachCom. ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

swimcoach1

Swim Coach

ఇది ఒక waterproof transmitting system. ఇందులో ఒక ట్రాన్స్మిటర్ (transmitter) మరియు రిసీవర్ (receiver) ఉంటాయి. ఈ రిసీవర్ ను ఈత కొట్టే వ్యక్తి swim cap కిందా లేదా swimming goggles వెనుకైనా పెట్టుకోవచ్చు. ఇది bone conduction (చెవి పైనా పక్కనా ఉండే పుర్రె భాగం ద్వారా శబ్దాన్ని చెవికి చేరవేస్తుంది) ద్వారా పని చేస్తుంది. దీనితో కోచ్ deck మీద ఉండే ఈత కొట్టే వారికి సూచనలు ఇవ్వచ్చు. ఇది అన్ని జల క్రీడలకూ పనికొస్తుంది. ఈ receiver పెట్టుకొంటే నీటిలో 100 మీటర్ల దూరం వరకూ deck మీద ఉన్న కోచ్ మాటలను గ్రహించగలదు. ఇది ఒక బృందం లోని ఈతగాళ్ళoదరికీ నీటిలో కోచ్ మాటలను వినిపించగలదు. అలాగే ఈ transmitter తన బృందం లోని ఒక్కొక్క ఈతగాడికీ వ్యక్తిగతమైన సూచనలు కూడా చేయగలదు.

Swim Coach

ఈ CoachCom పరికరంలో ఒక transmitter మరియు 3 receivers ఉంటాయి.

ఈ పరికరం ఈత కొట్టే వారికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

Courtesy