ఈ కాలం లో స్కూళ్ళన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళే. కాన్వెంట్లు, హై స్కూళ్ళు పోయి కాన్సెప్ట్, టెక్నో, ఇంటర్నేషనల్ స్కూళ్ళు వచ్చి చేరాయి. పేరు ఏదైనా ఇప్పుడు పిల్లలు అందరూ స్కూళ్ళకు దాదాపుగా బస్సుల్లోనే వెళ్తున్నారు. తెల్లారి లేచి పిల్లలను స్కూళ్ళకు రెడీ చేయడం ఒక ఎత్తు, వారిని బస్సు స్టాప్ లో ఎక్కించడం ఒక ఎత్తు. ఒక్కోసారి బస్సు వెళ్లిపోయిందా అనే అనుమానం కూడా వస్తూ వుంటుంది. ఇది కేవలం మన రాష్ట్ర పరిస్థితే కాదు, ప్రపంచo లోని చాలా దేశాల పరిస్థితి. అక్కడైతే ఒక్కోసారి విపరీతమైన చలి, మంచు లో కూడా పిల్లలు, తల్లులు బస్సు కోసం ఎదురు చూస్తుంటారు. ఇక అలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు అమెరికాకు చెందినా Tian Wu.

SBS_3

School children sitting in a school bus

ఆయన మాటల్లో చెప్పాలంటే తన బిడ్డ క్షేమం కోసం పుట్టిన తపనలోంచి పుట్టిందే ఈ ”స్పేషియల్ నెట్” (Spatial Net, Inc). ఆయన ఒక ఏవిఎల్ (Automated Vehicle Locator) అనే పరికరాన్ని స్కూల్ బస్సులకు అమర్చారు. దీనిని స్కూల్ బస్సులకు అమర్చితే అది ప్రతీ పది సెకండ్లకు ఆ బస్సు ఆచూకీని శాటిలైట్ కు ఇంకా సెల్ ఫోన్ టవర్ కు పంపిస్తుంది. ఆ విధంగా మనం బస్సు ఎక్కడ వుందో మన సెల్ లో లేదా ఏ కంప్యూటర్ లోనైన చూసుకోవచ్చు. దీనివల్ల తల్లిదండ్రులు మరియు పిల్లల సమయం ఆదా అవుతుంది. అంతే కాకుండా వానలో, చలిలో, మంచులో పిల్లలు ఎదురు చూడాల్సిన అవసరం వుండదు. అలాగే పిల్లలు తిరిగి మళ్ళి ఇంటికి ఎప్పుడు ఏ దారిలో వస్తారో కూడా తెలుసుకోవచ్చు. దీనిని అమెరికా లోని మాడిసన్ లోని స్కూళ్ళన్నిటికి ఉచితంగా అందించింది ఈ కంపెనీ. దీని ధర ఏడాదికి $50.

ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ ఏవిఎల్ ను మన ప్రభుత్వం, మన రాష్ట్రం లోని స్కూళ్ళన్నిటికి తప్పనిసరి చేయాలి. అప్పుడే చిన్నారులు సురక్షితంగా ఇంటికి చేరుతారు. ఇది కేవలం స్కూల్ బస్సులకే పరిమితం కాకుండా దీని పరిధిని పెంచగలిగితే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే, దీనిని ప్రైవేటు క్యాబ్స్, ఆఫీస్ క్యాబ్స్ కు అన్వయిస్తే ఎంతో మంది సురక్షితంగా వుంటారు.

Courtesy