ఈ రోజు ఉత్తర అమెరికా ఖండంలో అమెరికా దేశంలో సంపూర్ణ సూర్య గ్రహణం అలాగే కెనడా లో పాక్షిక సూర్య గ్రహణం సంభవించబోతోంది. దీనిని చూడడం కోసం సుమారు ఒక సంవత్సరం పాటుగా అక్కడి ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇది ఎంతటి విశేషం కలిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దాదాపుగా జరిగేవి పాక్షిక సూర్య లేదా చంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. కానీ సంపూర్ణ సూర్య గ్రహణం అది కూడా సుమారు ఒక గంట పాటు చూడటం అంటే మాటలు కాదు. అందువల్ల ప్రపంచవాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అమెజాన్ వంటి సైట్లలో అయితే ఈ సూర్య గ్రహణం చూసేందుకు సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ ను ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఇక ఇక్కడ సముద్ర తీరా ప్రాంతాల్లోని హోటళ్ళలో అయితే ఒక ఏడాది క్రితమే నిండిపోయాయి అంటే ఇది చూడడానికి ప్రజలు ఎంత ఉత్సాహ పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ప్రచండ భానుడైన సూర్యుడిని దాదాపుగా కమ్మేసినట్టు చీకట్లు అలముకునే సమయం చూడాలంటే ఎవరికి ఆసక్తి ఉండదు? ఇక్కడి ప్రజలు ఇప్పటికే టెలీస్కోప్లు, కెమెరాలు వగైరాలు పట్టుకుని వినువీధిలో జరిగే ఈ అద్భుతాన్ని చూడడానికి సిద్ధం అవుతున్నారు. అయితే వీటి పట్ల ఆసక్తి లేని వారికి మాత్రం ఈ హడావిడి కొంచెం చిరాకు కలిగించవచ్చు. ఏది ఏమైనా మానవుల చేతుల్లో లేని ఇలాంటి వింతలు కొన్నేళ్ళకు సంభవిస్తాయి. ఇది తెలిసి చూస్తే ఎదో వింత చూసిన అనుభూతి మాత్రమ కలుగుతుంది.

ఇక ఈ ఫోటోలో అమెరికా మొత్తం ఎప్పుడెప్పుడు ఎలా ఈ గ్రహణం జరుగుతుంది అన్నది ఇక్కడ చూడవచ్చు. అంతే కాదు, NASA దీనిని లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఇక్కడ అమెరికాలో మధ్యాన్నం పన్నెండు గంటలు నుంచి అంటే, సుమారు మన భారత దేశంలో రాత్రి 9.30 నుంచి రెండు గంటల పాటు ఇంటర్నెట్ లో ఈ కింది వెబ్ సైట్లలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
అవి NASA TV లోని ‘eclispe across america’ పేరుతో దీనిని ప్రసారం చేయనుంది. దీనిని youtube
Ustream
Facebook Live
NASA Edge
లలో చూడవచ్చు.

ఈ సమయంలో అమెరికాలోని ప్రజలు ఎవరైనా సూర్యుడిని ప్రత్యక్షంగా కాకుండా సోలార్ గ్లాసెస్ ధరించి చూడవచ్చు. నేరుగా మన కంటితో చూస్తే కంటి మీద సూర్యుని తీవ్ర కిరణాలు పడి కళ్ళు దెబ్బ తినవచ్చు.

కాబట్టి భారత్, అమెరికాలోని తెలుగు వారు ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని తగు జాగ్రత్తలతో వ్యవహరించి ప్రకృతిలో చోటు చేసుకునే ఈ పరిణామాన్ని చూసి ఆనందించండి.

Courtesy