మొబైల్ ఫోన్లలో కీ పాడ్ పోయి చాలా కాలమైంది. ఇప్పుడంతా టచ్ స్క్రీన్ ఫోన్లదే హవా. ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా, సోనీ వంటి సంస్థలు ఈ కాలపు కొత్త కొత్త ఫోన్లు అందులో విడుదల చేస్తున్న కొత్త కొత్త ఫీచర్ల తాకిడికి ఎప్పుడో చతికిల పడ్డాయి. ఇప్పుడంతా microsoft, ఆపిల్ iphone, samsung మరియు మార్కెట్ ను ముంచేస్తున్న చైనా సంస్థలు. ఫోను ఏ సంస్థకు చెందినదైనా అందులో లభించే ఫీచర్ లకే మన ఓటు.

ఇందుకోసం టచ్ స్క్రీన్ లు, స్క్రాచ్ ఫ్రీ, 16 MP కెమెరా, shock absorption (కింద పడినా పగలనటువంటివి) ఇలా ఎన్నో వచ్చేసాయి. ఇక వినియోగదారుడు వాడుకోవటానికి ఎంత సౌకర్యంగా ఉంటే అంత మంచిది. ఇందుకోసం Microsoft సంస్థ వారి Microsoft Research Division ద్వారా “pre-touch” ను తయారు చేస్తోంది. టచ్ తెలుసు కానీ ఈ ప్రీ టచ్ అంటే ఏంటి అనుకుంటే చదవండి మరి.

pre touch. పేరు లోనే ఉంది మర్మమంతా. పేరుకు తగ్గట్టు మనం ఫోను స్క్రీన్ ను ముట్టుకోనవసరం లేదు. మన వేలిని స్క్రీన్ పైన కదపటమే చాలు. ఆప్షన్స్ సెలెక్ట్ అవుతాయి. అంతే కాదు మనం ఏదైనా వీడియో/గేమ్ చూస్తుంటే మనo మన చేతిలో ఫోను పట్టుకున్న తీరును బట్టి మన వేలిని స్క్రీన్ పైన కదిపితే చాలు అక్కడ ఆప్షన్స్ ప్రత్యక్షమవుతాయి. కుడి వైపైతే కుడి ఎడమ వైపైతే ఎడమ వైపు కనిపిస్తాయి. ఒక వేళ రెండు చేతులతో పట్టుకొని రెండు వేళ్ళు స్క్రీన్ పైకి తీసుకొస్తే మరిన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అన్న మాట. అది ఎలాగో పైన వీడియో లు మీరు చూడవచ్చు.

అంతేనా మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూoటే మీ వేలు స్క్రీన్ పైన కదలడాన్ని బట్టి కoటెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది అన్న మాట. అంటే సాధారణంగా మన ఫోన్లు టచ్ sensitive కావడం వల్ల స్క్రీన్ స్క్రోల్ చేస్తుంటే ఒకటి బదులు మరొకటి సెలెక్ట్ అవ్వడం వంటి పొరపాట్లు ఉండవన్నమాట.

ఈ pre touch తో microsoft, Apple వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. చూద్దాం మరి ఇది ఇప్పుడు అందుబాటులోకి వస్తుందో, విజేతలెవరో?

Courtesy