మనం సినిమాలలో కొంత అతీంద్రియ శక్తులు కలిగిన వారు, గాయాలతో ఉన్న వారిని ముట్టుకోగానే గాయం మటుమాయం కావడం చూస్తుంటాం. ఇదంతా సినిమా అని కొట్టిపారేస్తుంటాం. అలాగే తాజాగా ఎలియన్ సినిమాలలో గ్రహాంతరవాసి, తాను కలిసిన మనిషికి దెబ్బ తగిలితే కేవలం కాంతి ద్వారా ఆ గాయాన్ని మాన్పడం చూసాం. కానీ ఇప్పుడు అది మాయా కాదు, మర్మం కాదు పూర్తి వైద్య విధానం అంటున్నారు అమెరికా మరియు ఆస్ట్రేలియా కి చెందిన పరిశోధకులు.

University of Sydney మరియు అమెరికాలోని Northeastern University, బోస్టన్ కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక సర్జికల్ గ్లూ ను తయారు చేసారు. ఈ గ్లూ, methacryloyl-substituted tropoelastin అనే ఎలాస్టిక్ ప్రోటీన్ ఆధారంగా తయారు చేసారు. జెల్ లాగా ఉండే ఈ గ్లూ ను శరీరం మీద ఎలాంటి గాయాల మీద వేసినా సరే, క్షణంలో గాయాన్ని మాన్పి ఎలాంటి మచ్చలు లేకుండా, అసలు అక్కడ గాయం అయిందా అన్న అనుమానం కలిగేలా గాయాన్ని మాన్పుతుందని అంటున్నారు Northeastern University కి చెందిన Nasim Annabi. ఇదేదో చిన్న చిన్న గాయాలకు కాదు ఒంట్లోని అవయావాల గాయాలను కూడా మాన్పుతుంది ఈ MeTro సర్జికల్ గ్లూ. శరీరం మీద గాయమై కుట్లు వేయాల్సి వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ప్రమాదాల్లోను, మానడానికి ఎన్నో రోజులు పట్టే గాయాలను కేవలం నిముషాలలో మాయం చేస్తుంది. అదెలాగో పై వీడియో లో మీరు చూడవచ్చు.

ఇక ఇంతకీ ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. గాయం మీద ఈ గ్లూ ను వేయగానే జెల్ కావడం వల్ల ఇది కారిపోదు. పైగా చర్మం మీద ఇది పడగానే ఇది ఘనీభవిస్తుంది. అప్పుడు దీని మీద అల్ట్రా వయొలెట్ కాంతి కిరణాలను ప్రసరింపచేసి, కాంతి ద్వారా short light-mediated crosslinking చికిత్స చేస్తారు వైద్యులు. తద్వారా ఈ సర్జికల్ గ్లూ గాయం అయిన ప్రదేశంలోని చర్మ గ్రంధులను బలంగా అతుక్కుని నిముషాలలో గాయాన్ని మాన్పుతుంది.

ఈ గ్లూ ముఖ్యంగా కుట్లు వేయాల్సి వచ్చినప్పుడు, చర్మం లేదా ఏదైనా అవయవం దెబ్బ తిని చిన్న పాటి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు, కుట్లు, సర్జరీ అవసరం లేకుండా గాయాన్ని మాన్పుతుందన్న మాట. ఈ గ్లూ ప్రత్యేకత ఏంటంటే, దీనిని ఉపయోగించడం వల్ల చర్మానికి ఎలాంటి హాని లేదు. ఇది పూర్తిగా సురక్షితం అంటున్నారు పరిశోధకులు. ఈ గ్లూ ను జంతువుల మీద ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ఈ గ్లూ కు సంబంధించి హ్యూమన్ ట్రయల్స్ ఇంకా మొదలు కావాల్సి ఉందని అంటున్నారు Nasim Annabi.

ఈ పరిశోధనను Science Translational Medicine జర్నల్ ప్రచురించింది.

Courtesy