మనకు హాలీవుడ్ సినిమాలలో చూసే కొన్ని రకాల సాంకేతిక పరిజ్ఞ్యానం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవి ఎంతో అడ్వాన్స్డ్ గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ సినిమాల నుండి స్ఫూర్తి తీసుకున్నారో ఏమో ఆ తరువాత అలాంటి పరికరాలు లేదా పరిజ్ఞ్యానమే పరిశోధకులు సాధ్యం ఉన్నారు. ఉదా. మనం హాలీవుడ్ సినిమాలలో చూసిన రెటీనా స్కాన్ మొదలైనవి ఇప్పటికే వాడుకలోకి వచ్చేసాయి. అలా తాజాగా మైనారిటీ రిపోర్ట్ సినిమా నుండి స్ఫూర్తి పొందారో ఏమో అందులో హీరో టామ్ క్రూజ్ కేవలం చేతి కదలికల ద్వారా టీవిని నియంత్రిస్తుంటాడు. ఇప్పుడు అచ్చం అలాంటిదే UK చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు.

టీవీ చూడాలంటే ముందు మనం టీవీ రిమోట్ ఎక్కడుందో చూడాలి. అలా ప్రతీ ఇంట్లో ప్రతీ రోజు ఈ టీవి రిమోట్ ను గురించి వెతుకులాట మనకు కొత్తేమీ కాదు. కానీ టీవీల స్వరూపమే మారిపోతున్నప్పుడు మరి రిమోట్ కూడా మారాలి కదా. అలా మారే సమయం ఆసన్నమయింది. UK లోని Lancaster University కి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు Matchpoint అనే సిస్టం ద్వారా టీవిని రిమోట్ లేకుండా ఆపరేట్ చేయవచ్చు అని అంటున్నారు. అదెలాగో చూద్దాం.

ఈ Matchpoint system ను spontaneous spatial coupling ఆధారంగా రూపొందించారు. ఇది టీవి ఎదురుగా ఉన్న వారి శరీర కదలికలను గుర్తించి, దానిని టీవికి అనుసంధానం చేసి తద్వారా టీవిని ఆపరేట్ చేస్తుందన్న మాట. అంటే మీరు టీవి ఎదురు సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నారు అనుకోండి, మీరు అదే కాఫీ కప్ తో ఛానల్స్ ను మార్చచ్చు, వాల్యూం పెంచచ్చు, తగ్గించవచ్చు. ఈ Matchpoint లో టీవి పైన ఒక వెబ్ కామ్ ను అమర్చుతారు. అది టీవి స్క్రీన్ అడుగు భాగంలో ఒక గుండ్రని ‘widget’ ను చూపిస్తుంది. మీ శరీర కదలికలను ఈ widget ద్వారా టీవిని ఆపరేట్ చేస్తుంది. అంతే, దీనితో మన రోజువారీ ఏ వస్తువు తోనైనా మనం టీవిని నియంత్రించవచ్చు. కావాల్సిందల్లా మనం ఆ వెబ్ కామ్ పరిధిలో ఉండటమే. ఇక మీ కాఫీ కప్ కు బదులు మరో వస్తువుతో టీవిని నియంత్రించాలి అంటే ఆ వస్తువు బదులు మీకు నచ్చిన వస్తువును కెమెరా వ్యూ పరిధిలోకి తీసుకొస్తే చాలు.

ఇంకా ఈ Matchpoint కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, మన చేతిలో ఉన్నవే కాదు అచేతన వస్తువులతో కూడా టీవిని ఆపరేట్ చేయచ్చు. అదెలాగంటే టీవి వెబ్ కామ్ ముందు ఒక పిల్లలు ఆడుకునే కారును పెట్టి టీవిలో పాటలు ప్లే చేస్తే ఆ పాటలను కేవలం ఈ కారు ద్వారా రీవైండ్, ఫార్వర్డ్, నెక్స్ట్, ప్రీవియస్ ఇలా మార్చవచ్చు అన్న మాట.

ఈ Matchpoint ను ఆపరేట్ చేయడానికి ప్రత్యేకమైన సంజ్ఞ్యలు నేర్చుకోవాల్సిన అవసరం లేకపోవడం విశేషం. మన చేతుల్లోని వస్తువులతో మన ఇష్టoవచ్చిన సంజ్ఞ్యలతో టీవిని ఆపరేట్ చేయచ్చు. ఈ పద్ధతిలో ఒక్కరే కాదు ఇద్దరు ముగ్గురు సైతం ఇలా టీవి ని ఆపరేట్ చేయవచ్చు.

ఈ Matchpoint ను University of Lancaster లో School of Computing and Communications కు చెందిన Christopher Clarke బృందం రూపొందించారు. వీరు ఈ పేపర్ ను కెనడాలో జరిగే User Interface Software and Technology 2017 సమావేశంలో ప్రదర్శించనున్నారు.