మనం ఎప్పుడైనా ఏదైనా రద్దీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనతో వచ్చిన మనవారు మన నుంచి విడివడి ఎక్కడికో వెళ్ళడం, లేదా వెనక ఉండిపోవడం, ఆ పైన మనం వారి కోసం వెతుక్కోవడం అనేది ప్రతీ ఒక్కరికీ అనుభవమే. అయితే ప్రస్తుతం అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా లొకేషన్ తెలుసుకునేందుకు అంటే ప్రతీ చోటా అవి సరిగా పని చేయవు. సెల్ సిగ్నల్ అందకపోవడం, బాటరీ అయిపోవడం వల్ల ఇప్పటికీ ఒక బృందంలో ఎవరో ఒకరు వెనకబడిపోవడం వారి ఆచూకీ తెలియక కంగారుపడడం జరుగుతుంది. అది పెద్దవారు అయితే పర్లేదు, అదే చిన్న పిల్లలైతే క్షణం కనిపించకపోయినా తట్టుకోలేము. ఇలా ఒక బృందంలోని వారి ఆచూకి కోసం తయారు చేసిందే ఈ Lynq లొకేషన్ ట్రాకర్.

ఈ Lynq ను ఈ ఏడాది CES 2018 లో విడుదల చేసారు. ఇవి ఒక జతగా విక్రయిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఎలాంటి సెల్ ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్ అవసరం లేకుండా ఇది పని చేస్తుంది. GPS ఆధారంగా ఇది పని చేస్తుంది. దీనిలో కేవలం ఒకే ఒక్క బటన్ ఉంటుంది. ఒక్క Lynq పరికరం 12 మంది వరకు (Lynq పరికరం కలిగిన వారు) వారి ఆచూకీని కంట కనిపెడుతూ ఉంటుంది. దీనిలో కేవలం కుడి, ఎడమ చూపిస్తూ వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారో చెబుతుంది ఈ Lynq. 5 కిలోమీటర్ల పరిధి వరకు ఇది వ్యక్తులు ఆచూకీని చూపించగలదు. ఈ పరిధిని సేఫ్ జోన్ అని అంటారు. ఈ పరిధిని ఎవరైనా దాటితే వెంటనే Lynq లో alert వస్తుంది. అంతే వెంటనే ఆ వ్యక్తిని కనిపెట్టే దిశగా ఆలస్యం లేకుండా ప్రయత్నం చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది వాడటం ఎంతో తేలిక అందువల్ల దీనిని పిల్లలకు సైతం నేర్పించి రద్దీ ప్రదేశాల్లో లేదా మరెక్కడైనా వారిని కంట కనిపెడుతూ ఉంటుంది ఈ Lynq. ఈ Lynq ను మన బెల్ట్, ప్యాంటు లేదా బాగ్ కు తగిలించవచ్చు. అంతే కాదు దీని బాటరీ ఏకధాటిగా 3 రోజుల వరకు పని చేస్తుంది. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. GPS ఆధారంగా రూపొందించినా, ఆ సమాచారాన్ని ప్రత్యేకమైన AI అల్గోరిథం ద్వారా compress చేసారు. దాని వల్ల ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి, వేగంగా సాధ్యం అవుతోంది. అలా ఎన్నో డిజిట్లు ఉండే GPS coordinates, సమాచారాన్ని compress చేయడం వల్ల ఆ data కేవలం రెండు మూడు బైట్లలో ఒదిగిపోతోంది. ఆ విధంగా ఈ Lynq పరికరాల మధ్య సమాచారం తెలుసుకుంటూ ఉంటుంది.

అందరికంటే ఎక్కువగా ఇది US మిలిటరీ వారికి బాగా నచ్చింది. ఎందుకంటే తమ సైనికుల ఆచూకీ ఒకరికి ఒకరికి ఎలాంటి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా తెలియచేయడమే అందుకు కారణం. ఈ Lynq లొకేషన్ ట్రాకర్ ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు, ట్రెక్కింగ్, స్కీయింగ్, అడవుల్లోకి వెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఈ Lynq ను ప్రీ ఆర్డర్ చేస్తే $154 (one pair) కు లభిస్తుంది.

Courtesy