మన నిత్య జీవనంలో మనం వాడే ఎన్నో వస్తువులు వృధా అవుతుంటాయి. అంటే, ప్యాకింగ్లలో ఉత్పత్తి ఉన్నాఅది బైటికి రావని వృధాగా పడేస్తున్నాం. ఏంటో అర్ధం కావట్లేదా…అదేనండీ, తెల్లారి లేచి టూత్ పేస్టు తో మొదలు పెట్టి షాంపూ, కాస్మెటిక్స్, ఆయింట్మెంట్, కెచప్ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే అది చాంతాడు అంత అవుతుంది. వీటన్నిటిలో ఎంత వృధా అవుతోందో గమనించాం కదూ. ఒక్క సాస్ బాటిల్స్ లోనే ఏడాదికి ఒక మిలియన్ టన్నుల సాస్ వృధా అవుతోందట. ఇక పైవన్నీ కలుపుకుంటే ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు ఎంత నష్టం వాటిల్లుతోందో కదండి. అందుకే అమెరికా లోని Massachusetts Institute of Technology (MIT) కి చెందిన శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కొన్నారు. అదే ”లిక్విగ్లైడ్” (Liquiglide).

LG_4
LG_6

ఈ లిక్విగ్లైడ్ అనేది ఒక విషరహిత కందెనము (Nontoxic Lubricant) అంటే జారుడు స్వభావము వంటి రసాయనము. ఈ ద్రవాన్ని ప్రత్యేకంగా ప్యాకింగ్ యొక్క లోపలి భాగానికి రాసి ఉంచుతారు. అలా తయారు చేసిన ప్యాకింగ్ లోని వస్తువు లేదా పదార్ధం చివరి బొట్టు వరకు బైటికి వచ్చేస్తుంది. ఈ పద్ధతి లో ప్యాకింగ్ లోపలి పదార్ధం లేదా వస్తువు ఈ ద్రవం తో కలవకపోవడం విశేషం. అందువల్ల ప్యాకింగ్ లోపలి పదార్ధం లో ఎటువంటి మార్పు వుండదు. ఇంకా చెప్పాలంటే ఇది తామరాకు మీద నీటి బొట్టుకు తడి ఏ విధంగా అంటదో, అలా లోపలి పదార్ధం పూర్తిగా ఈ ద్రవం తో కలవకుండా వుంటుంది. దీని వల్ల ఖాళీ అయిపోయిన డబ్బాలు తిరిగి శుద్ధి (రిసైకిల్) చేయడానికి వీలవుతుంది. అందువల్ల సంస్థలకు ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. అలాగే ఈ లిక్విగ్లైడ్ పూర్తిగా సురక్షితం. ఎందుకంటే ఇది పూర్తిగా సహజంగా దొరికే వస్తువులతో తయారు చేయబడింది. ఇక ఈ లిక్విగ్లైడ్ ను ఉత్పత్తిని బట్టి మర్చగలగడం ఇంకో విశేషం. అంటే, ఆహార పదార్ధాలకు ఈ లిక్విగ్లైడ్ ను చెట్ల (plants) నుంచి, ఆహారపదార్థాలు కాని (Non-food) వాటికి వేరే ఇతర రసాయనాల (non-edible chemicals) నుంచి తయారు చేస్తారు. అలాగే మిగతా ఉత్పత్తులకు వాటికి సరిపడే పదార్ధాలతో ఈ లిక్విగ్లైడ్ ను తయారు చేస్తారు.

LG_1 LiquiGlide_2

LiquiGlide_3

ఇప్పటికే అమెరికా లోని కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను ఈ లిక్విగ్లైడ్ తో తయారు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ లిక్విగ్లైడ్ తో తయారైన ఉత్పత్తులు కొన్ని నెలలలోనే అమెరికా లో విడుదల కాబోతున్నాయి.అవి త్వరగా అందరికి అందుబాటులోకి రావాలని ఆశిద్దాము.

Courtesy