ప్రస్తుత కాలం అంతా ఫిట్నెస్ దే హవా. ఎక్కడ చూసినా fitbit మొదలైన స్మార్ట్ వాచ్ లు సందడి చేస్తున్నాయి. ఈ వాచ్ లు ఫిట్నెస్, ఆక్టివిటీ ట్రాకింగ్, కెలొరీ కౌంట్ అంటే ఏంటో సామాన్యులకు అర్ధం అయ్యేలా చేయడం వల్ల ఇవి మార్కెట్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఒకప్పుడు బరువు తగ్గలన్నా, ఫిట్నెస్ పెంచుకోవాలన్న ఒంటి కొలతలు తప్ప మరే దారి లేదు. అలాంటిది ఈ స్మార్ట్ వాచ్ ల పుణ్యమా అని ఎవరికి వారు తమ రోజూవారి వ్యాయామం, ఎంత కెలొరీలు ఖర్చు చేసారు, ఎంత కెలొరీ ఆహారం తిన్నారు మొదలైనవన్నీ ఎవరి సహాయమూ లేకుండా తెలుసుకుంటున్నారు. అందుకే ఈ స్మార్ట్ వాచ్ (వేరబుల్స్) లకు గిరాకీ. వీటిని తోసి రాజని ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్ కూడా స్మార్ట్ వాచ్ లతో పోటీ పడుతున్నాయి. అలా మొట్ట మొదటి సారిగా ఒక స్మార్ట్ గ్లాస్, స్మార్ట్ వాచ్ ఫీచర్లతో రూపొందించబడి స్మార్ట్ వాచ్ లకు పోటీ ఇస్తోంది. మరి అదేంటో చూద్దామా.

Activity tracking in watches

Activity tracking in watches

VSP Global అనే కంటి ఇన్సురెన్సు సంస్థ ఈ Level అనే స్మార్ట్ గ్లాసెస్ ను తయారు చేసింది. గూగుల్, ఇంటెల్ వంటివి సమాచారం, ఫోన్ వినియోగం కోసం స్మార్ట్ గ్లాసెస్ ను తయారు చేస్తే, ఈ Level మాత్రం వాటికి భిన్నంగా కేవలం ఫిట్నెస్ ప్రధానంగా రూపొందించబడింది. చాలా మందికి నిత్యావసర వస్తువు కళ్ళజోడు (గ్లాసెస్)లోనే ఈ ఫిట్నెస్ ఫీచర్లతో రూపొందించబడింది. దీనికి కారణం ఏంటంటే, fitbit వాచ్ ను ప్రత్యేకించి గుర్తు పెట్టుకుని రోజంతా పెట్టుకోవాల్సి వస్తుంది. అదే, కళ్ళజోడు అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి తప్పనిసరిగా పెట్టుకునే అలవాటు ఉండటం వల్ల ఈ విధంగా రూపొందించమని అంటున్నారు రూపకర్తలు.

ఇక ఈ గ్లాసెస్ లోని ఎడం వైపు భాగంలో accelerometer, Gyroscope, magnetometer అమర్చబడి ఉన్నాయి. ఇవి నడక, నడిచిన దూరం, ఖర్చు చేసిన కెలొరీలు, వ్యాయామ సమయం మొదలైనవి రికార్డు చేస్తుంది. అన్ని వేరబుల్స్ లానే బ్లూటూత్ ద్వారా ఫోన్ కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. ఈ స్మార్ట్ గ్లాస్ యాప్ లో ఈ ఆక్టివిటీ అంతా రికార్డు అవుతుంది. అంతే కాదు వ్యాయామం చేసే వారిని ఉత్సాహ పరచడానికి ఇందులో పాయింట్స్ కూడా ఉంటాయి. నిర్దిష్టమైన పాయింట్స్ వస్తే దానితో ఎవరైనా సహాయార్ధులకు కంటి పరీక్షను డొనేట్ చేయడం వంటి అవకాశం ఉంది ఈ యాప్ లో.

సరే, ఈ Level స్మార్ట్ గ్లాసెస్ మూడు రకాల ఫ్రేమ్ లలో లభ్యం అవుతుంది. ఈ గ్లాస్ ఫ్రేమ్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 5 రోజులు నిరంతరాయంగా పని చేస్తుంది. దీనిలో ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ సైతం వేసుకుని ఈ గ్లాసెస్ ను వాడుకోవచ్చు. ఒక వేళ దీనిలో ఛార్జ్ అయిపోయినా గ్లాసెస్ యధావిధంగా వాడుకోగలగటం దీనిలోని సౌకర్యం. ఈ Level స్మార్ట్ గ్లాసెస్ ధర $270.

Courtesy