Siachen. ఈ పేరు తాజాగా వార్తల్లో నిలిచింది. ఎందుకో చూద్దాం. ఇది మనకు పాకిస్తాన్ కు ఉన్న ఒక సరిహద్దు. అది మాత్రమేనా, ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాంతం. సుమారు సముద్ర మట్టానికి 6000 – 7000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని పైన నియంత్రణకు భారత సైన్యం కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్ తో యుద్ధమే చేయాల్సివచ్చింది. ఫలితంగా ఇది మన సొంతం అయ్యింది. ఇది దాని చరిత్ర. ఇది అలా ఉంచితే, ఇక్కడ ఉండే అత్యంత విపరీత వాతావరణ పరిస్థితులకు (-60 డిగ్రీలు) మన సైన్యం గడ గడా వణికి పోతోంది. ఇక అక్కడ విరిగే పడే మంచు పెళ్ళలకు ఎంతో మంది సైనికులు బలైపోతున్నారు. మొన్న ఆ మధ్య హనుమంతప్ప తో సహా మరికొంత మంది సైనికులు ఈ మంచు కింద చిక్కుకునే ప్రాణాలు విడిచారు. ఇదీ అక్కడి పరిస్థితి.

అయితే ఈ పరిస్థితి లో మార్పు తీసుకు రావాలని సంకల్పించారు మన దేశంలోని ISRO కు చెందిన శాస్త్రవేత్తలు. పైన చెప్పిన రెండు సమస్యలకు ISRO శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనుగొన్నారు. వీరు ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా అత్యంత తేలికైన  Silica aerogel అనే (insulating material) పదార్ధాన్ని తయారు చేసారు. దీనితో తయారయిన దుస్తులు (యునిఫారం) మన సైనికులు ధరిస్తే వారికి అక్కడి వీపరీతమైన చలి నుంచీ రక్షణ లభిస్తుంది అంటున్నారు. అంతే కాదు ఈ ప్రత్యేకమైన దుస్తులు అత్యంత తేలిగ్గా ఉండడం విశేషం. ఇదొక్కటే కాదు ఈ Silica aerogel తో మరిన్ని ఉపయోగాలున్నాయి – ఇంట్లోని కిటికీ అద్దాలకు ఈ పదార్ధం తో తాపడం చేస్తే, వేసవిలో వేడిని లోపలి రాకుండా అడ్డుకుని కేవలం సూర్య కాంతిని మాత్రమే లోపలకు రానిస్తుంది. ఇక చలి కాలంలో ఈ అద్దాలు ఇన్సులేటర్ లా పని చేసి లోపలి గదిని వెచ్చగా ఉంచుతుంది.

ఆ పైన వారు బాటరీ ద్వారా పని చేసే ఒక రేడియోను తయారు చేసారు. దీన్ని సైనికులు కానీ, ఇటువంటి నిర్మానుష్య ప్రాంతాలైన హిమాలయాల్లో సంచరిస్తున్న వారు కానీ ఉపయోగిస్తే దీని నుంచీ వచ్చే రేడియో సిగ్నల్స్ మన ఉపగ్రహాల ద్వారా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడన్న సమాచారాన్ని(Lat-Long info) గ్రౌండ్ స్టేషన్స్ కు పంపిస్తుంది. ఆ విధంగా మంచులో కూరుకుపోయినా కూడా వ్యక్తి జాడను ఖచ్చితంగా చెప్పగలదు. ఇది ఒక hand held device. దీనిలోని బటన్ నొక్కితే ఇది ఆక్టివేట్ అవుతుంది. ఇది పూర్తిగా 65 గంటలు పాటు పని చేస్తుంది. కనుక ఆపదలో ఉన్నప్పుడు దీనిని ఉపయోగిస్తే rescue teams ఆ వ్యక్తిని కనుగొనడానికి ఉపయోగపడుతుంది.

అయితే ప్రస్తుతం ఈ Silica aerogel ను పూర్తి స్థాయిలో వినియోగించడానికి మరి కొంత సమయం పడుతుందని దీన్ని తయారు చేసిన బృందంలో ఒకరైన Naga Priya అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి వచ్చి సియాచెన్లో ప్రాణాలకు తెగించి పహారా కాస్తున్న మన సైనికులకు రక్షణనిచ్చి వారి ప్రాణాలను కాపాడాలని ఆశిద్దాం.

వందే మాతరం

Courtesy