ఫెబ్రవరి నాలుగు వరల్డ్ కాన్సర్ డే. దీనిని అంతగా ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటే, ఏటా ప్రపంచవ్యాప్తంగా దీని బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అంతే కాదు మన దేశంలో ప్రస్తుతం 2.5 కోట్ల మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఇక ప్రతీ రోజు ఏడు లక్షల కొత్త కాన్సర్ కేసులు నమోదవుతున్నాయి అంటే ఇది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ జబ్బు అందరికీ ఒకలా ఉండదు. స్త్రీలకు, పురుషులకు వేర్వేరు కాన్సుర్లు వస్తాయి. ఏ కాన్సర్ అయినా వెంటనే బయటపడదు. అది బాగా ముదిరిన తర్వాత కానీ ఇది బయటపడదు. ఆ పైన దీనికి వైద్యం కూడా ఎంతో కష్టంతో, డబ్బుతో కూడుకుని ఉంటుంది.

సరే, ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది అంటే వైద్యులు కొన్ని కారణాలు చెబుతున్నారు – అనారోగ్యకరమైన జీవన విధానం, వంశ చరిత్ర, మద్యపానం, పొగాకు తాగడం వంటి కారణాల వల్ల మనుషులకు ఈ కాన్సర్ సోకే అవకాశం పెరుగుతుందని అంటున్నారు. ఇది కాకుండా మరో ప్రత్యేకమైన, ముఖ్యమైన అంశాల్లో ఒకటి మనం తినే ఆహారం. అవును ఏదో తింటున్నాం అంటే సరిపోదు ఈ రోజుల్లో మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనం తినే ఆహారంలో కొన్ని పదార్ధాలను దీర్ఘకాలం వాడితే దాని వల్ల కాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు. అంతే కాదు ప్రతీ 10 కాన్సర్ కేసుల్లో ఒక కేసు ఆహార నియమం వల్ల నివారించవచ్చని అంటున్నారు. మరి మన ఆరోగ్యం పై అంత దుష్ప్రభావం చూపే ఆ పదార్ధాలు ఏంటో చూద్దామా.

1 Trans fats: వంట నూనెలను మరింత రసాయనాలతో ట్రీట్ చేసిన తరువాత వచ్చేవి ఈ Trans fats. ఇవి కాన్సర్, హృద్రోగాలకు ముఖ్యమైన ప్రేరకాలు. డాల్డా మొదలైన వాటిలో అధిక స్థాయిలో ఉండే omega 6 ఫాటీ ఆసిడ్ మన రక్తంలో కణ జాలాన్ని దెబ్బ తీస్తాయి. మనం తినే చాలా రెడీమేడ్ ఫుడ్ వెనుక లేబిల్ చూస్తే అందులో దీని శాతం ఉంటుంది, కానీ చాలా మందికి దీని ప్రాముఖ్యత తెలియక అలాగే తినేస్తుంటాం. ప్రస్తుతం అమెరికా మొత్తం 2018 కల్లా ఈ Trans fats ని నిషేధించాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మన ప్రభుత్వం మేల్కొనకపోయినా ఎవరికీ వారు జాగ్రత్త పడితే మంచిది.

2. సోడా, మరియు శీతల పానీయాలు: ఇవి ఏదో రుచి, వాటి పై మోజు కోసం తాగుతున్నారు తప్ప వీటిలో పోషకాలు పూర్తిగా సున్నా. దీనిలో అత్యంత అధికంగా చక్కెర, కెలొరీల వల్ల వీటిని ఎక్కువ తాగితే కాన్సర్ కు మంచి గ్రౌండ్ వర్క్ చేసినట్టే.

3. రిఫైన్డ్ షుగర్: మనం రోజు వాడే తెల్లని పంచదార. ఇది లేకపోతే మనకు రోజే గడవదు కదూ. ఇది కాన్సర్ కె కాదు మరెన్నో రోగాలకు ఇది ముఖ్య కారణం అని వైద్యులు చెబుతున్నారు. ఇది రసాయనాలతో తయారు చేయడం వల్ల దీనిని ఎన్ని స్పూన్లు వేసుకున్నారు మోతాదు మించితే రక్తం లో గ్లూకోస్ స్థాయిల్లో సైతం హెచ్చు తగ్గులు తద్వారా కాన్సర్ కు కారణం అవుతుందని అంటున్నారు. అంతేనా ఆర్టిఫిషియల్ స్వీటేనర్ లు సైతం మంచివి కావని వైద్యులు సూచిస్తున్నారు. మళ్ళీ సారి మీరు కప్ కాఫీ తాగేటప్పుడు ఈ సంగతి మర్చిపోకండి.

4. Canned foods: మనకు మార్కెట్లో చాలా ఆకర్షణీయంగా కనిపించేది ఈ canned foods. అందులో లభించే రెడీమేడ్, మేడ్ ఈజీ ఆహారాన్ని తినడానికి చాలా మంది ఇష్ట పడతారు. కానీ ఈ కాన్లు bisphenol-A, phthalates మరియు styrene తో తయారు చేయడం వల్ల ఇవి ఆ ఆహార పదార్ధంలో కలిసి పోయి మన జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తాయి అంతే కాదు తీవ్ర హార్మోన్ల అసమతుల్యాన్ని కలుగ చేస్తాయి. ఆ విధంగా కాన్సర్ కు ముఖ్య ప్రేరకాలు అవుతున్నాయి.

5. కాల్చిన ఆహారం లేదా మాంసం: మార్కెట్లో కాల్చిన మాంసం లేదా ఆహారం (Grilled Process) లో heterocyclic aromatic amines అధికంగా ఉంటాయి, ఇవి కాన్సర్ కు అతి ముఖ్యమైన ప్రేరకాలు. వీటిని అధికంగా తీసుకుంటే కాన్సర్ ను ఆహ్వానించినట్టే.

Courtesy