ప్రస్తుత కాలంలో వాయిస్ అసిస్టెంట్ల హవా పెరుగుతోంది. అవి siri, Alexa, గూగుల్ అసిస్టెంట్, echo ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మన ఇంట్లోని వైఫై ద్వారా వీటితో కేవలం మన గొంతుతో పని చేయించుకోవచ్చు. వీటినే IoT (Internet of Things) అని అంటారు. అలాగే ఇంటికి అనుసంధానం చేస్తే హీటర్ లేదా ఏసి ఆన్/ఆఫ్, ఉబెర్ కార్ బుక్ చేయడం, వాతావరణ సూచన ఇంకా చాలా విధాలుగా వీటి ఉపయోగాలున్నాయి. ఈ వాయిస్ అసిస్టెంట్స్ ను ఇంట్లో ఎక్కడైనా ప్లగ్ చేస్తే చాలు అవి పని చేయడం మొదలు పెడతాయి. అయితే ఇలా ఇంట్లో ఉన్న వాయిస్ అసిస్టెంట్స్ చేత ఎక్కడున్నా పని చేయించుకోగలిగితే అప్పుడే ఈ పరికరాలను సరిగ్గా వినియోగించుకున్నట్టు. అలా అయితే ఇంట్లో పెట్టుకున్న ఈ Siri, Alexa మొదలైన వాటిని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లడం సాధ్యం అయ్యే పని కాదు. ఇప్పుడు ఈ పరికరాలకు ఉన్న ఈ పరిమితిని చెరిపేస్తూ వచ్చేసింది ఈ Jinni (హలో జీని). ఇంతకీ ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దామా.

ఇంట్లో ఎలాంటి వాయిస్ అసిస్టెంట్స్ ఉన్నా దానిని ఈ Jinni కి అనుసంధానం చేస్తే చాలు. ఆ పరికరం ఇంట్లో ఉన్నా మీకు కావాల్సిన పనిని ఈ జీని ద్వారా చేయించుకోవచ్చు. అదెలాగో ఇక్కడే మీరు వీడియోలో చూడండి. ఇది చూడటానికి నల్లని చతురస్రాకారం లో మన అరచేతిలో ఇమిడిపోయే పరికరం. దీనిని మన కార్ డ్రైవింగ్ వీల్, లేదా కార్యాలయం గోడ మీద, లేదా వేసుకున్న షర్టుకైనా తగిలించుకుని మీ వాయిస్ తో ఇంట్లో ఉన్న వాయిస్ అసిస్టెంట్స్ ఏ పనులు చేస్తాయో అవన్నే వాటితో చేయిస్తుంది. దీని టాక్ mode ను ఆన్ చేసి ఆఫ్ చేస్తూ వాడితే దీని బాటరీ వరం రోజులు వస్తుంది. అదే ఈ Jinni ని రోజంతా వాడితే ఒక రోజులోనే బాటరీ అయిపోతుంది. అంతే కాదు ఈ జీనిని ఫోన్ కు బ్లుటూత్ ద్వారా ఫోన్ కు అనుసంధానం చేస్తే ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ అలాగే మ్యూజిక్ సైతం ఫోన్ నుండి ప్లే చేస్తుంది. ఇలా బహు ఉపయోగాలున్న ఈ Jinni ధర కేవలం $60-70 మాత్రమే.

Courtesy