తాజాగా విడుదల అయిన గూగుల్ అసిస్టంట్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఓకే గూగుల్’ అంటే వచ్చే వాయిస్ కంట్రోల్ కు ఇది పొడిగింపు అని చెప్పాలి. ఈ వాయిస్ కంట్రోల్ తో మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని అధిగమించి అసిస్టంట్ ను 2016 లో ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం అది గత సంవత్సరం కొన్ని ఫోన్ లలోనే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ నౌగాట్ మరియు మర్ష్మల్లౌ సాఫ్ట్వేర్ ఉన్న ఫోన్ లలో లభిస్తుంది. అప్పుడు కూడా ఇది రానున్న కొన్ని రకాల కొత్త ఫోన్ లలోనే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ సర్వీస్ అప్డేటెడ్ వెర్షన్ లో ఈ అసిస్టంట్ లభిస్తుంది. అంటే Samsung Galaxy S7, Samsung Galaxy S7 edge, OnePlus 3T, HTC 10 మొదలైన ఫోన్ లలో లభిస్తుంది.

సరే ఇప్పుడు ఇందులో ప్రవేశ పెట్టిన మరో ఫీచరే గూగుల్ లెన్స్. దీనితో చాలా ఉపయోగాలే ఉన్నాయి. అంటే సాధారణ లెన్స్ ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంది. కానీ ఈ గూగుల్ లెన్స్ ఆ ప్రపంచంతో స్పందిస్తుంది. అంటే పేరులో చెప్పినట్టే ఈ లెన్స్ అందులో చూపిoచబడ్డ వస్తువు యొక్క సమాచారాన్ని మనకు ఇస్తుంది అన్న మాట.

ఉదా. ఈ గూగుల్ అసిస్టెంట్ లో గూగుల్ లెన్స్ లోకి వెళ్లి ఒక హోటల్ పై ఫోకస్ చేస్తే మీరు కీ పాడ్ లో టైపు చేసి చూడకుండానే ఆ హోటల్ యొక్క రేటింగ్, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి.

ఇక ఏదైనా విదేశంలో ఉంటే జపాన్, చైనా వంటి దేశాల్లో sign బోర్డు ల మీద ఉన్న భాష లో ఏం రాసుందో తెలియాలి అంటే, ఈ గూగుల్ లెన్స్ ను దాని మీద ఫోకస్ చేస్తే చాలు, మీకు కావాల్సిన భాషలో దాన్లో ఏముందో చెప్పేస్తుంది.

ఇక మీరేమైనా మ్యుజియం కు వెళ్ళినా ఏదైనా బొటనికల్ గార్డెన్స్ కు వెళ్ళినా ఏదైనా పువ్వు లేదా శిల్పం గురించి తెలుసుకోవాలంటే దాని పై ఫోకస్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి సమాచార, మీకు స్క్రీన్ పై వచ్చేస్తుంది.

ఇక అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే మేరేక్కడైనా మీ స్నేహితుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి వైఫై రౌటర్ ను ఫోకస్ చేస్తే చాలు మీ ఫోన్ ఆ నెట్వర్క్ కు కనెక్ట్ చేస్తుంది.

కంప్యూటర్ లు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకుని మన అవసరాలకు తగ్గట్టు స్పందిస్తే మనకు ఇంత సౌకర్యంగా ఉంటుందా అనిపిస్తుంది కదూ. ఇంకా చెప్పాలంటే ఇది ప్రారంభం మాత్రమే మున్ముందు ఇంకా ఏమేo సౌకర్యాలు మన ఫోన్ లో రాబోతున్నాయో.