ఈ కాలంలో ఇంచుమించు ప్రతీ దానికి ప్రత్యామ్న్యాయాలు వచ్చేసాయి. ఒకప్పుడు చాలా సమయం పట్టే పనులు కూడా ప్రస్తుత సాంకేతికత వల్ల తేలిగ్గా ఇంట్లోనే చేసుకోగలుగుతున్నాము. అందుకు వైద్య రంగాన్నే ఉదాహరణగా చెప్పాలి. ఒకప్పుడు వైద్యుడు పరీక్ష చేసి నిర్ధారించే బీపి, డయాబెటిస్, ఇంకా పలు రకాల జబ్బులను ఇంట్లోనే ఎవరి సహాయం అవసరం లేకుండా పరీక్ష చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ కోవలోకి కంటి పరీక్ష కూడా వచ్చి చేరిపోయింది. అవును చాలా మంది కంటికి పవర్ ఉంటుంది. అది పెరిగిందో లేదో చూపించుకుంటూ ఉండాలి. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఇంట్లో వృద్ధులు కావచ్చు, లేదా పెద్దలు, చిన్న వాళ్ళు పని వత్తిడి వల్ల Optometrist వద్దకు వెళ్లి కంటి పరీక్ష చేసుకోరు. ఫలితంగా తల నొప్పి, లేదా పవర్ పెరగడం వంటివి జరుగుతాయి. ఇప్పుడు ఇక Optometrist అవసరం లేకుండా ఆ కంటి పరీక్ష ఎవరికి వారు ఇంటి దగ్గరే సులభంగా చేసుకునే విధంగా అందుబాటులోకి వచ్చేసింది EyeQue personal vision tracker.

EyeQueCorp అనే సంస్థ ఈ ఇన్ హోమ్ విజన్ టెస్టర్ ను రూపొందించింది. ఇది ఒక స్మార్ట్ ఫోన్ యాప్ కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. అలాగే దీనిలో ఆప్టికల్ స్కోప్ అనే ఒక చిన్న పరికరం ఉంటుoది. విజన్/పవర్ పరీక్ష కోసం ఈ EyeQue యాప్ లో రిజిస్టర్ అవ్వాలి. ఆ పైన పరీక్ష కోసం ఈ optical స్కోప్ ను ఫోన్ కు అతికించుకోవాలి (ఫోన్ కు అతికించే స్ట్రాప్ కూడా ఈ కిట్ లో ఉంటుంది). ఆ పైన యాప్ లో ‘టెస్ట్’ బటన్ వత్తి కంటిని ఈ scope ద్వారా యాప్ స్క్రీన్ చూడాలి. అప్పుడు యాప్ లో రెండు గీతలు కనిపిస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ విడివిడిగా కనిపిస్తాయి. వీటిని కలిపే విధంగా స్క్రీన్ పై కనిపించే +/- బటన్ వత్తితే రెండూ ఒక్కటవుతాయి. అంతే కంటి పరీక్ష పూర్తి అయినట్టే. అలా రెండు కళ్ళకు పవర్ ఎంత ఉందో చూసుకోవచ్చు. సెకన్లలో పవర్ ఎంత ఉందో ఈ యాప్ చూపించేస్తుంది. ఇప్పుడు ఆ పవర్ ను బట్టి మీ గ్లాసెస్ ను మీరు ఏమాత్రం ఆలస్యం లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. అంతే కాదు ఈ యాప్ లో ఉండే పర్సనల్ డాష్బోర్డు మీ విజన్ హిస్టరీ ని సేవ్ చేసి మీకు తగిన సూచనలు చేస్తుంది.

ఈ EyeQue విజన్ ట్రాకర్ కు CES 2017 బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు లభించింది. అవును ప్రపంచవ్యాప్తంగా eye testing కు ఉండే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత సులభంగా ఇన్ హోం టెస్టింగ్ పరికరాన్ని రూపొందించినందుకు ఈ అవార్డు రావడం సరైనదే అనిపిస్తుంది. ఈ విజన్ టెస్టింగ్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే దీని ధర. అందరికీ అందుబాటు అయ్యే విధంగా కేవలం $30 కే ఈ విజన్ టెస్టింగ్ అందుబాటులో ఉంది. ఈ పరికరం అమెజాన్ మరియు కొన్ని eye టెస్టింగ్ సెంటర్లలో లభ్యం అవుతోంది.