గంగా యమునాది నదులు పుణ్య నదులు. మన సంస్కృతికి జీవనాడులు. అటువంటి నదులు మానవ చర్యల వల్ల, పరిశ్రమ వ్యర్ధాల వల్ల కలుషితం అవుతున్నాయని మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ నదులను శుభ్రపరిచేందుకు పెద్ద ఉద్యమమే నడుస్తోంది. దాని ఫలితంగానే ఈ నదులలో కలిసే కాలవలలోని వ్యర్ధాలను శుద్ధి చేసి మంచి నీరు కలిసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఖరీదైన సీవేజ్ ప్లాంట్ల నిర్మాణం తో పాటు అతి తక్కువ ఖర్చుతో కాలవ వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు Eco Bio Block (EBB) ను సైతం ఉపయోగిస్తున్నారు. “నమామి గంగే” పేరిట గంగా నది ప్రక్షాళన చేసే ఈ Eco Bio Block (EBB) ను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం.

Eco Bio Block (EBB) అనేది ఒక జపనీస్ సంస్థ వృద్ధి చేసిన పరిజ్ఞ్యానం. KOYOH అనే సంస్థ కొన్ని సంవత్సరాల పాటు కృషి చేసి దీనిని కనుగొన్నది. bacillius subtilis natto అనే బాక్టీరియా ను సిమెంట్ పేస్టు తో కలిపి ఒక పోరస్ బ్లాక్ (Porous Block) తయారు చేసి మురుగు కాలవలో ఉంచితే చాలు దీనిలోని బాక్టీరియా అందులోని మలినాలను తినేసి వాసన లేని స్వచ్చమైన నీరు లభిస్తుంది. దీనిలోని బాక్టీరియా (సూక్ష్మ క్రిములు) నీటిలో ఉండటం చేత ప్రతీ అరగంటకు ఉత్పత్తి కాబడతాయి. అవి ఆర్గానిక్ వ్యర్ధాలను కార్బన్ డై ఆక్సైడ్ మరియు వాటర్ కింద మార్చుతుంది అలాగే ammonia ను nitrite మరియు nitrates కింద మార్చుతుంది. ఈ రెండిటినీ నీటిలోని మొక్కలు, సూక్ష్మ జీవులు పీల్చుకుని nitrogen గ్యాస్ ను విడుదల చేస్తాయి. ఆ విధంగా పర్యావరణానికి హాని కలుగకుండా గంగా నదిలో చేరే బకర్గంజ్ అనే పాట్నా లోని కాలువ శుద్ధి చేయబడుతోంది.

అయితే కాలుష్యపు తీవ్రతను బట్టి ఈ బ్లాక్స్ బరువు, సంఖ్య పెరుగుతాయి. సరిగ్గా కాలువ గంగలో కలిసే 3-4 కిలోమీటర్ల మేర ఇవి ఏర్పాటు చేయబడి గంగను కలుషితం చేయకుండా మంచి నీటిని అందులోకి విడుదల చేస్తున్నాయి.
జపాన్ సంస్థ KOYOH పేటెంట్ చేసిన ఈ EBB లను ప్రపంచవ్యాప్తంగా మురుగు నీటిని శుభ్రం చేసేందుకు ఎన్నో దేశాలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి. వియత్నాం, చైనా మరియు ఇండియా వంటి దేశాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. అలాగే మన దేశంలో ఈ EBB ల పని తీరును మన CPCB (Centre for Pollution Control Board) పరిశీలించి వీటి వాడకానికి ఆమోద ముద్ర వేసింది. అయితే మన దేశంలో ఈ EBB లను తయారు చేయడానికి US Environ అనే సంస్థ మాత్రమే లైసెన్సు కలిగి ఉంది.

మానవాళికి మేలు చేసే ఇటువంటి పరిజ్ఞ్యానం అందరికీ అందుబాటులోకి రావాలి.
సర్వే జనా సుఖినో భవంతు.

Courtesy