డ్రోన్లు. ఈ దశాబ్దపు విప్లవాత్మకమైన ఆవిష్కరణలలో ఒకటి అని చెప్పచ్చు. వినోద వస్తువు కాస్తా ఎన్నో విధాలుగా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే దీనిని ఎమర్జెన్సీ సర్వీసులకు, షాపింగ్ డెలివరీ లకు, భద్రతా రంగాల్లో ఉపయోగిస్తున్నారు. దీనితో ఇప్పుడు మరో ప్రయోజనం కూడా చేకూరబోతోంది. అది, అడవులలో, కొండ ప్రాంతాల్లో దారి తప్పి పోయిన వారిని వెతికి పట్టుకోవడం. అదెలాగ అంటే చదవండి మరి.

Dronte in Forest1

University of Zurich, the Università della Svizzera italiana, మరియు University of Applied Sciences and Arts of Southern Switzerland కు చెందిన పరిశోధకులు artificial intelligence software ను ఈ డ్రోన్లలో ఉపయోగించడం ద్వారా ఇవి ఈ కష్టసాధ్యమైన పని చేయగలవని వీరు అంటున్నారు. ఏటా, ఒక్క స్విట్జర్లాండ్ లోనే 1000 కి పైగా కాల్స్ అడవిలో, పర్వతాలలో తప్పి పోయిన వారి నుంచి వస్తాయని, వారిని ఎంత త్వరగా కనిపెట్టగలిగితే అంత త్వరగా వారిని కాపాడవచ్చు అని భావిస్తున్నారు పరిశోధకులు. స్విట్జర్లాండ్ ఒక్కటే కాదు, అమెరికా ఇంకా ఇతర దేశాల్లోని పర్వత ప్రాంతాల్లో, అడవులలో ఏటా కొన్ని వేల మంది తప్పి పోతుంటారు. అందులో కొంత మంది రక్షణ బృందానికి (rescue team) కు దొరకవచ్చు, కానీ కొంత మంది శాస్వతంగా అక్కడ చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటారు. అన్నిoటిలో ప్రధానంగా అమెజాన్ అడవులలో ఎక్కువ మంది తప్పి పోతుంటారు. అక్కడి దట్టమైన చెట్లు rescue operations కు అడ్డుగా నిలుస్తాయి. కాబట్టి అక్కడ ఈ డ్రోన్ల అవసరం ఎంతైనా ఉంది అని చెప్పచ్చు.

Drone Forest 2

అయితే ఈ దట్టమైన అడవులలో డ్రోన్లు తిరగడం, దారులను పోల్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే, ఇక్కడ ఉపయోగపడాలంటే ఈ డ్రోన్లు ముఖ్యంగా తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అంచనా వేయగలగాలి. అలాగే మనుషుల వలే వేరు వేరు దార్లను గుర్తు పట్టాలి. ఇది అంత సులభమైన పనేం కాదు. ఇందుకోసం ఈ డ్రోన్లో మన స్మార్ట్ ఫోన్ లో ఉండేటటువంటి రెండు చిన్న కెమెరా లను అమర్చారు. గాల్లో ఎగురుతుoడగానే ఇవి తమ చుట్టూ ఎన్నో ఫోటోలు తీస్తుంటాయి. ఇలా తీసిన ఫోటోల్లో నుంచి artificial intelligence algorithm ద్వారా మనుషులు నడచిన దారులను కనిపెడుతుంది. అలా ఏదైనా దారి కనిపించినప్పుడు ఈ డ్రోన్ మళ్ళీ ఆ దిశగా వెతకడం మొదలు పెడుతుంది. ఆ విధంగా మనుషులు సంచరించలేని దారులలో తిరిగి ఇవి తప్పిపోయిన వారి జాడ కనిపెట్టగలవు. ఇందులోని సాంకేతికతను ఇప్పుడు పరిశీలిద్దాం.

ముందుగా artificial intelligence అంటే, మనుషుల వలే రోబోట్లకు/యంత్రాలకు శిక్షణ ద్వారా పొందే తెలివితేటలను artificial intelligence అంటారు. ఇక ఇందులో ముఖ్య అంశం ఈ algorithm. ఇది Deep Neural Network అనే ఒక algorithm. ఈ algorithm కోసం ఈ బృందం అడవులలో, పర్వతాలలో కొన్ని రోజుల తరబడి తిరిగి అక్కడ man trails ను 20,000 ఫోటోలు తీసి ఈ software కు చూపించి శిక్షణనిచ్చింది. ఈ software మనలాగే సాధన ద్వారా వాటిని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టింది. ఆ తరువాత, అంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక దారిని చూపించగా ఈ algorithm ఖచ్చితంగా గుర్తు పట్టింది. అంత పటిష్టంగా దీనిని తయారు చేసామని Prof. Davide Scaramuzza అన్నారు.

అయితే ఇది ఇంకా తోలి దశలోనే ఉందనీ, ఇది పూర్తి వ్యాపారాత్మకంగా అందుబాటులోకి రావడానికి మరి కొంత సమయం పడుతుందనీ అంటున్నారు ఈ పరిశోధకులు. వీరి ప్రయత్నం ఫలించి భవిష్యత్తులో ఈ కొండలలో కోనలలో చిక్కుకోకుండా ఎవరి ప్రాణాలనైనా కాపాడితే అంతకు మించి కావాల్సింది ఏముంది.

Courtesy