రవాణా రంగం ద్వారా మనకు నిత్యం దొరికే కూరగాయల నుంచీ మనం వేసుకునే బట్టల దాకా వీటి ద్వారానే లభిస్తున్నాయి. ఒక రకంగా చెప్పలంటే రవాణా రంగం ఏ ఏ దేశ ఆర్ధిక రంగంలోనైనా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. అది రోడ్డు మార్గం కావచ్చు, రైలు, విమాన లేదా సముద్ర మార్గం ద్వారా కావచ్చు. ఒక ప్రాంతం నుంచీ వస్తువులను మరొక ప్రాంతానికి తరలించి అక్కడి వ్యాపారాభివృద్ధికి కారణమవుతుంది. సరే, ఇంత పెద్ద ఎత్తులో కాకపోయినా మనం కూడా నిత్యo ఎదో ఒక రకమైన రవాణా సౌకర్యాన్ని వాడుకుoటున్నాం. అందులోనూ ఇప్పుడు అంతర్జాలంలో పెరిగిన వాణిజ్యం కారణంగా ఎన్నో వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.

వీటిని మనకు అందించేందుకు ఎంతో మంది ప్రైవేటు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అవి DHL, FedEx ఇంకా మరెన్నో సంస్థలు రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా వస్తువులను వినియోగదారులకు రవాణా చేస్తున్నాయి. దీనినే Logistics అని కూడా అంటారు. అయితే ఒకప్పుడు కొన్ని రోజులు పట్టేది కాస్తా ఇప్పుడు ఒక్క రోజులో వినియోగదారునికి చేరిపోతోంది. ఇది కూడా కాదని ఇప్పుడు గంటల్లో రవాణా చేసందుకు సిద్ధ పడుతున్నాయి పెద్ద పెద్ద సంస్థలు. అది కూడా సాదా సీదాగా కాదు కొన్నేళ్ళ పాటు శ్రమించి సాంకేతికతను అభివృద్ధి చేసుకుని మరీ పోటీ పడుతున్నాయి. DHL సంస్థ ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా డ్రోన్లు మరియు చిన్న సైజు హెలికాప్టర్ల ద్వారా వస్తువులను వినియోగదారులకు రవాణా చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 2013 నుంచీ 2016 వరకూ REITIMWINKL అనే సంస్థతో కలిసి ఈ సాంకేతికతను అభివృద్ధి చేసుకుని emergency medicines వంటి వాటిని జర్మనీ లోని పర్వత ప్రాంతాల నుంచీ రవాణా చేయడం మొదలు పెట్టింది. ఈ డ్రోన్ అటానమస్ (Autonomous) కావడం విశేషం. సరుకు లోడ్ చేసాక వాటంతట అవే గాలిలోకి ఎగిరి 8 కిలోమీటర్లు ప్రయాణించి end customer కు చేరవేయడం మీరు ఇక్కడ వీడియో లో చూడవచ్చు.

ఈ డ్రోన్ మాత్రమే కాదు DHL వారి parcelcopters కూడా వారి Skyport అనే కేంద్రంలో సరుకు చేరవేస్తే అక్కడి నుంచీ ఈ parcelcopters North Sea మీదుగా ప్రయాణించి గమ్య స్థానానికి నిముషాల్లో చేరవేయడం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు.

ఈ పద్ధతి లో మంచుతో కూడుకున్న దేశాల్లో కావలసిన అత్యవసర వస్తువులను లేదా మందులను రోడ్డు మార్గం కంటే కూడా సురక్షితంగా క్షణాల్లో అందచేయవచ్చు.

Courtesy