మన నిత్య జీవనంలో ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగింది. ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, కుర్చీలు ఇలా ఎన్నో విధాలుగా దీనిని ఉపయోగిస్తున్నాం. దీని వాడకం తేలిక అయినా దీని ద్వారా పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలైనా భూమిలో కరుగక భూమిని కలుషితం చేస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు రీసైకలబుల్ ప్లాస్టిక్ (Recycalable plastic) పట్ల దృష్టి సారించారు. ఈ ప్లాస్టిక్ ను రీసైకిల్ (Clean) చేసి మళ్ళి దానినే మరో విధంగా వాడతారు అన్న మాట. ఈ విధంగా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ఇప్పుడు మరో మెట్టు ఎక్కి ఏకంగా రీసైకలబుల్ ప్లాస్టిక్ తో రోడ్లే వేయచ్చు అంటున్నారు “VolkerWessels” అనే డచ్ కంపెనీ వారు.

Plasti_roads_1

వారి మాటల్లో చెప్పాలంటే…వారు “ప్లాస్టిక్ రోడ్” అనే ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్నారు. ఇందులో తారు, కాంక్రీట్ కు బదులుగా రీసైక్లబుల్ ప్లాస్టిక్ ను వాడి రోడ్డును తయారు చేస్తారు. దీని యొక్క నాణ్యత మరియు సామర్ధ్యం సాధారణ రోడ్డు కంటే 3 రెట్లు ఎక్కువ. అలాగే ఈ రోడ్డును వేయడానికి కేవలం కొన్ని వారాల సమయం సరిపోతుంది. ఇది కేవలం యురోప్ వంటి చలి దేశాల్లోనే అనుకుంటే పొరపాటు. ఇది 80 డిగ్రీల వరకు వేడిని తట్టుకుంటుంది. అంటే ఎండ ఎక్కువగా వుండే ఆసియా వంటి దేశాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్టిక్ రోడ్డు కింద కూడా పైప్లైన్లు మరియు కేబుల్స్ వంటివి వేయవచ్చు.

Plasti_roads_2

ప్రస్తుతం ఈ కంపెనీ వారు నెదర్లాండ్స్ లోని రోటర్ డాం (Rotterdam) అనే ఊరిలో దీనిని పరీక్షించాలి అనుకుంటున్నారు. ఈ విధంగా దీని యొక్క పరిమితులు సరి చేసి దీనిని మార్కెట్లోకి తీసుకు రావాలని వీరి యోచన. అదే జరిగితే మరో మూడు ఏళ్లలో ప్లాస్టిక్ రోడ్ సాధారణ రోడ్లకు ప్రత్యామ్న్యాయం కాబోతుంది.

Plasti_roads_3

అదే జరిగితే కొన్ని కోట్ల రూపాయలను, విపరీతమైన ఎండల్లో కొన్ని నెలల పాటు శ్రమించి రోడ్లు వేసే కాంట్రాక్టర్లు, కూలీల శ్రమను తగ్గించినట్టే.

Courtesy