మతి మరపు లేదా మెమరీ లాస్ (memory loss), మెమరీ లాస్ అని ఈ మధ్య కాలంలో పాటలు కూడా వచ్చాయి కదూ. అవి సరదాగా నవ్వుకోడానికి ఉద్దేశించినా, నిజ జీవితంలో మెమరీ లాస్ పేషెంట్ల పరిస్థితి ఎంతో దుర్బరంగా ఉంటుంది. ఈ మెమరీ లాస్ 2 రకాలు అవి, 1. Short term memory Loss , 2. Long term memory Loss. ఆనారోగ్య కారణాల వల్ల వచ్చినా, ప్రమాద వశాత్తు సంభవించినా వీటికి మందు లేదు. కొద్దో గొప్పో మార్పు రావాలన్నా దానికి దీర్ఘకాలం వైద్యం అవసరం. అందువల్ల ఈ “మెమరీ లాస్” మీద ఎన్నో పరిశోధనలే జరుగుతున్నాయి. అలంటి ఒక పరిశోధనలో ఇటువంటి రోగులకు మెదడులో ఒక చిన్న పరికరాన్ని (brain implant) అమర్చడం ద్వారా ఈ మెమరీ లాస్ నయమవుతుందని వైద్యులు కనుగొన్నారు. మరి ఆశక్తి ని కలిగించే ఆ పరిశోధనా వివరాల్లోకి వెళ్దామా!!

Memory Implant

University of Southern California మరియుWake Forest Baptist Medical Center కు చెందిన పరిశోధకులు ఇంకా USC School of Engineering కు చెందిన Ted Berger మరియు Dong Song లతో సంయుక్తంగా ఈ “Implant” ను తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి ముందుగా వారు మెదడులో సమాచారాన్ని జ్ఞాపకంగా ఎలా భద్ర పరుచుకుంటుoదో అధ్యయనం చేశారు. ఇంద్రియాల ద్వారా మెదడుకు చేరిన సమాచారాన్ని Electric Signals గా మెదడులో ఒక్కో కేంద్రాన్ని దాటి “Hippo Campus” కు పంపిస్తుంది. ఈ క్రమంలో ఒక్కో చోట ఈ “Electric signal recode” అయ్యి చివరకు “Hippo Campus” లో జ్ఞాపకంగా భద్రపరచ బడుతుంది.

Memory ImplantMemory Implant

ఇప్పుడు పరిశోధకులు అప్పటికే మెదడులో electrodes అమర్చిన పేషెంట్స్ నుండి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ను సేకరించి ఒక algorithm ను తయారు చేశారు. ఈ algorithm ఆధారంగా పనిచేసే electrodes ను రోగుల మెదడులో అమర్చగా ఈ Implant కేంద్రాలను దాటుకొని మరో కేంద్రానికి ఈ electrical signals ను చేర్చి చివరకు “Hippo Campus” కు చేరుస్తుంది. అక్కడ అవి జ్ఞాపకంలా భద్రపరుస్తుంది. ఈ Implant ద్వారా 95% సత్ఫలితాలు వచ్చాయని వీరు పేర్కొంటున్నారు. దీనిని ఒక పరికరంలా తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు వీరు.

అందుకే ప్రజల రోగాలు నయం చేయగల వైద్యులను గూర్చి ఒక సామెత వాడుకలో ఉంది అది – వైద్యో నారాయణో హరి” అని.

Courtesy