అమెజాన్ echo, apple సిరి, అలెక్సా మొదలైనవి వాయిస్ అసిస్టెంట్లు. వీటి రాకతో ఇంట్లోని వాతావరణమే మారిపోయింది. బయట వాతావరణం (వెదర్) నుండి ఇంకా మనకు పుట్టుకొచ్చే చాలా ప్రశ్నలకు కేవలం ఈ పరికరాలను అడిగితే అందుకు తగ్గ సమాధానాన్ని ఇంటర్నెట్ మొత్తం మధించి మన ముందు ఉంచుతున్నాయి. అంతెందుకు నిన్న మొన్నటి వరకు ఏదైనా పదం యొక్క అర్ధం కోసం డిక్షనరీ చూసే మనకు, ఇప్పుడు వీటి రాకతో ఆ డిక్షనరీలు మూలాన పడ్డట్టే. సరే, ఈ వాయిస్ అసిస్టెంట్లు ఇంటి వరకే పరిమితం. కానీ బయట కూడా మనకు ఇలాంటి ఒక వాయిస్ అసిస్టెంట్ తోడుంటే? అది కూడా మన మనసులో మాటను కనిపెట్టి, ఆ మాటను ఉచ్చరించాల్సిన అవసరం లేకుండానే ఆ సమాచారాన్ని మన చెవిలో వేస్తే అదే ఈ AlterEgo. అదేంటో చూద్దామా.

MIT (Massachusetts Institute of Technology) కి చెందిన పరిశోధకులు ఒక పరికరాన్ని రూపొందించారు. మన మనసులో మాటను కనిపెట్టి దానికి సమాధానం చెప్పే పరికరమే AlterEgo. ఇది ఒక చెవి నుండి మన గడ్డం వరకు ఉండే bone conduction band. bone conduction band అంటే మన చెవిలో ఎలాంటి ఇయర్ ఫోన్స్ లేకుండానే సమాచారాన్ని కేవలం మనకు మాత్రమే వినిపించేలా చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకోసమ మన తలలో చెవి పక్క ఎముకల ద్వారా శబ్దం గ్రహింపబడుతుంది.
సరే, ఇంతకీ దీని వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, దీనిని పెట్టుకుని టీవిని నియంత్రిoచచ్చు, అలాగే మన ఇంట్లోనే మిగతా లైటింగ్, మొదలైనవి నియంత్రించవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూడచ్చు. ప్రస్తుతం సెల్ ఫోన్లు మానవ సంబంధాలకు అంతరాయం కలిగించేలా ఉన్నాయి. ఏదైనా ఒక సమాచారం తెలియాలంటే, పక్కవారు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఫోన్ చూడాల్సి ఉంటుంది. ఈ ఇబ్బంది అధిగమించి సోషల్ లైఫ్ కు ఎలాంటి అడ్డంకి లేకుండా మనకు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. అయితే ఈ AlterEgo ప్రస్తుతం 92% accuracy కలిగి ఉంది. కానీ ఇది చాలదు. ఈ పరికరం 95% accuracy కి చేరుకుంటేనే ఇది మార్కెట్లోకి విడుదల కాగలదు. ఈ మూడు శాతం లోటును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు దీని రూపకర్తలు. AI ఆధారిత AlterEgo ఎక్కువ మంది చేత దీనిని ఉపయోగించేలా చేస్తే దీని accuracy >95% అవుతుంది అంటున్నారు.

దీనితో పలు వాణిజ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి. అంతే కాదు వాయిస్ అసిస్టెంట్లకు దూరంగా ఉంటే అవి సరిగా చెప్పినవి అర్ధం చేసుకోలేవు. ఈ AlterEgo వేరబుల్ కావడంతో ప్రశ్న అర్ధం కాకపోవడం అనే సమస్యే తలెత్తదు. అయితే ఈ AlterEgo పూర్తి స్థాయిలో అభివృద్ధి అయ్యి మార్కెట్లోకి విడుదల కావడానికి మరి కొంత సమయం పడుతుంది.

Courtesy