ఒంటి చెమటను బట్టి ఆరోగ్యాన్ని సూచించే స్మార్ట్ బ్యాండ్

ఒకప్పుడు ఒంటి ఆరోగ్యాన్ని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష ఒక్కటే మార్గం. పలు రకాల అవయవాలకు పలు సార్లు రక్త పరీక్ష చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా అవసరం లేదు. ఒంటి మీద సూది గుచ్చకుండా కేవలం ఒక స్మార్ట్ బ్యాండ్ ఇంకా చెప్పాలంటే ఒక స్వేట్ బ్యాండ్ మన ఆరోగ్య రహస్యాలను చెప్పేస్తుంది. ఒక్కసారి కాదు అలా నిరంతరం సమాచారం ఇస్తూనే ఉంటుంది. అది ఎలాగా అంటే వేరబుల్స్ తోనే సాధ్యం.

అయితే ఇప్పటికే మార్కెట్లో విడుదల అయిన fitbit, apple వంటివి శారీరక వ్యాయామం ద్వారా గుండె చప్పుడు వంటి వాటిని సూచిస్తాయి. కానీ అంత కంటే సూక్షంగా మన ఆరోగ్యం గురించి కేవలం మన ఒంటికి పట్టే చెమట ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నారు University of California, Berkeley కు చెందిన Ali javey, electrical engineering and computer science professor. ఆయన తన బృందంతో కలిసి ఈ sweat band ను రూపొందించారు. దీనిని చేతి మణికట్టుకు కానీ, నుదురు మీద కానీ కట్టుకుని వ్యాయామం చేస్తే అప్పుడు ఒంటికి పట్టే చెమట ద్వారా మన body temperature (శరీర ఉష్ణోగ్రత), muscle fatigue, body electrolytes ఏ మేరకు ఉన్నాయో తెలిసిపోతుంది.

మన ఒంటికి పట్టే చెమటలో ఎన్నో రసాయనాలు ఉంటాయి. వాటిని విశ్లేషిస్తే మన శరీర ఆరోగ్యం గూర్చి తెలుసుకోవచ్చు అంటారు Ali. ఈ sweat band లోని అయిదు సెన్సర్స్ మన చెమటలోని సోడియం, పొటాషియం, lactate, గ్లుకోజ్, శరీర ఉష్ణోగ్రత వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని ఒక ప్రాసెసర్ కు పంపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఈ సమాచారం వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా మొబైల్ లోని యాప్ కు చేరిపోతుంది. ఈ సెన్సర్స్ మరియు ఈ సర్క్యూట్ బోర్డు ఒక పలుచని flexible band మీద ముద్రించగలగడం విశేషం. వేరబుల్స్ లో ఎన్నడూ లేని విధంగా రసాయన శాస్త్రం మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కలయికలో ఈ band తయారు చేయబడటం దీని యొక్క ప్రత్యేకత.

ఈ sweat band ను మరింత పటిష్టంగా తయారు చేసేందుకు అలీ, UC (University of California) లోని George Brooks, professor of integrative biology తో కలిసి పని చేసారు. వీరు ఈ band ను 26 మంది యువతీ, యువకుల మీద పరీక్షించారు. ఈ వాలంటీర్లు వివిధ రకాల వ్యాయామo చేస్తున్నప్పుడు దీనిని ఉపయోగించగా ఇది విజయవంతంగా పని చేసింది. దీనిని తక్కువ ఖర్చులో తయారు చేసే యోచనలో ఉన్నారు Ali Javey.

ఇది వ్యోమగాములకు, క్రీడాకారులకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఫిట్నెస్ పట్ల దృష్టి పెట్టె ఎవరికైనా ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.

ఈ పరిశోధన “Nature” జర్నల్ లో ప్రచురించబడింది.

Courtesy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *