మీరు విన్నది నిజమే. కేవలం ఒక సెల్ఫీ తో భయంకరమైన ఈ జబ్బును గుర్తించవచ్చు అంటున్నారు అమెరికాలోని University of Washigton (UW) కు చెందిన పరిశోధకులు. అసలు ఇంతవరకూ ఎలాంటి పరీక్షలు లేని ఈ వ్యాధిని రిస్క్ పేషెంట్లకు ముందుగానే గుర్తించి ముందుగా చికిత్స చేయవచ్చు అంటున్నారు UW పరిశోధకులు. UW లోని Ubicomp lab లో రూపొందించిన Biliscreen అనే యాప్ ద్వారా ఇది సాధ్యం.

ఇంతకీ ఈ కాన్సర్ ఎందుకు ప్రాణాంతకం అయిందంటే ఈ వ్యాధి పెద్ద వాళ్ళకు వచ్చే కామెర్ల ద్వారా బయట పడుతుంది. అప్పుడు రక్తంలో బైలురుబిన్ ఎక్కువై పోతుంది. అదే ఈ వ్యాధికి సంకేతం. అప్పుడు తదుపరి చేసే వైద్య పరీక్షలలో ఈ వ్యాధి బయట పడుతుంది, అప్పటికే ఇది బాగా ముదిరిపోయినట్టు లెక్క. అది ముదిరాక చేసేదేమీ ఉండదు. అందువల్ల ఈ వ్యాధిని ఎప్పటికప్పుడు ఎవరికివారు ఉందో లేదో తెలుసుకునే విధంగా ఈ యాప్ ను రూపొందించారు. సెల్ఫీ నే ఎందుకు అంటే, మన కళ్ళు మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలను చెప్పేస్తాయి. మన కనుగుడ్డు లోని తెల్లని భాగాన్ని వైద్య పరిభాషలో sclera అంటారు. శరీరంలో బైలురుబిన్ ఎక్కువైతే కళ్ళు పచ్చబడతాయి. అది మనకు తెలియక పోవచ్చు. అందుకే ఈ యాప్. కంటిలోని తెల్లని భాగం పచ్చగా మారడాన్ని ఈ యాప్ గుర్తిస్తుంది. తద్వారా శరీరంలో ఏ స్థాయిలో బైలురుబిన్ ఉందో చెప్పేస్తుంది.

ఇంతకీ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ పరీక్ష కోసం తయారు చేసిన ఒక 3D ప్రింటెడ్ బాక్స్ లో మన స్మార్ట్ ఫోన్ ను ఉంచి ఈ విధంగా మన కళ్ళను ఫోటో తీయాలి. ఇది ఎందుకు అంటే ఫ్లాష్ సరిగా కంటి మీద మాత్రమే పడేందుకు. అప్పుడు ఈ Biliscreen యాప్ కంప్యూటర్ విజన్ ద్వారా కేవలం తెల్లని భాగాన్ని మాత్రమే తీసుకుని విశ్లేషిస్తుంది. ఇప్పుడు కంటి మీద Sclera లో కన్ను మీద పడిన మరియు పరావర్తనం చెందిన కాంతి wavelenght ను బైలురుబిన్ స్థాయిలను మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ (Machine Learning Algorithms) ద్వారా బేరీజు వేసుకుని బైలురుబిన్ ఎంత ఉందో చెప్పేస్తుంది. ఒక వేళ ఎక్కువ ఉంది అనుకుంటే తగిన వైద్య సలహా, పరీక్షలు అవసరం అవుతుంది.

ఈ Biliscreen యాప్ ను 70 మంది రోగుల మీద ఉపయోగించగా ఇది 90 శాతం విజయవంతంగా పని చేసింది. ఈ యాప్ ఉపయోగించాలి అనుకుంటే, ఈ 3D ప్రింటెడ్ బాక్స్ లేదా ఈ గాగుల్స్ తప్పనిసరి. ఇప్పుడు ఈ బృందం ఈ యాప్ ను మరింత ఎక్కువ మంది మీద దీనిని ఉపయోగించి దీని సమర్ధతను పరీక్షించనుంది.

ఈ పరిశోధనను సెప్టెంబర్ 13న జరిగే UBICOMP 2017 సదస్సులో ప్రదర్శించనున్నారు. UW డాక్టర్లు, పరిశోధకులు కలిసి రూపొoదించిన ఈ యాప్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.

Courtesy