మనం ఉపయోగించే మొబైల్స్, టాబ్లెట్ పిసీస్, లాప్ టాప్ లో లిథియం ఆయాన్ బాటరీస్ ని వాడతారు, ఈ బాటరిలు రీచార్జబల్ కాబట్టి మనం ఛార్జ్ చేసే విధానాన్ని బట్టి వీటి లైఫ్ ని పెంపోదించు కోవచ్చు. లేకపోతె 1 లేదా 2 సం. లో ఈ బాటరిలు చెడిపోతాయి. ముక్యంగా ఈ బాటరిల కి వచ్చే ప్రాబ్లం ఛార్జ్ డ్రెయిన్ (drain) అవ్వడం అంటే మీరు ఛార్జ్ చేసిన ఆ బాటరీ కి పవర్ ని నిల్వ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది.

అలా కాకుండా ఈ బాటరిల లైఫ్ ని కాపాడుకోవాలంటే ఈ కింద చెప్పే చిట్కాలు తప్పనిసరిగా పాటించండి.

1. మీరు ఉపయోగించే ఏదైనా గాడ్జట్ ని ఎక్కువ ఎండ లో కాని వేడి ని రిలీజ్ చేసే వస్తువల పక్కన కాని ఉంచకూడదు. ఎందుకంటే ఆ వేడి ఒకవేళ 30 – 35 డిగ్రీస్ దాటిందంటే అది లిథియం బాటరీ యొక్క లైఫ్ స్పాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.

2. మీరు మీ గాడ్జట్ యొక్క బాటరీ ని 10% లేదా అంతకంటే తక్కువ గా వచ్చినంత వరకు ఉపయోగించకూడదు. ఎందుకంటే అలాగా లిథియం బాటరీ వాడితే అది ఛార్జ్ ని డ్రెయిన్ చేసేందుకు అవకాసం వుంది. అందుకని ఎప్పుడైనా మీ బాటరీ 70% – 40% లో ఉన్నప్పుడే రీచార్జ్ చెయ్యడం మంచిది.

3. మీరు మీ గాడ్జట్ ని ఎక్కువ కాలం వాడక పోతే దానిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవటం మంచింది. అంతేకాని మీ మొబైల్ ని దానంతట అదే స్విచ్ ఆఫ్ అయ్యేలాగా చెయ్యకూడదు. అంతే కాకుండా మీ బాటరీ ని కనీసం 50% ఛార్జ్ చేసి స్విచ్ ఆఫ్ చెయ్యడం మంచిది.

4. మీరు మీ మొబైల్ ని ఛార్జ్ చేసేటప్పుడు దానికి వున్నకవర్ ని తీసి ఛార్జ్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే బాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడు అది వేడిని విడుదల చేస్తుంది. మొబైల్ కి కవర్లే కపోవడం వల్ల ఆ వేడి దానంతట అదే బయటకి వెళ్లిపోతుంది. లేకపోతె ఆ వేడి వాళ్ళ బాటరీ కి లైవ్ స్పాన్ తగ్గుతుంది.

ఈ పైన చెప్పిన బేసిక్ టిప్స్ పాటిస్తే మీ బాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.